జగన్ కర్ణాటక అస్త్రం: హిందూపురంలో బాలయ్య ఉక్కిరిబిక్కిరి
Balakrishna: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
సమ ప్రాధాన్యత: ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

ఆసక్తి కలిగించే అభ్యర్థి: ఈ జాబితాలో ఆసక్తి కలిగించే పేరు జొలదరాశి శాంత. వైసీపీ అభ్యర్థిగా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మరోసారి అవకాశం కల్పించలేదు జగన్. ఆయనకు బదులుగా జే శాంతను బరిలో దింపారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు పెద్దగా వినిపించని పేరు ఇది. రెండో జాబితా విడుదల కావడానికి ఓ మూడు గంటలు ముందే ఆమె వైసీపీలో చేరారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే. శాంత
— YSR Congress Party (@YSRCParty) January 2, 2024
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జే. శాంత 2009 లో లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ… pic.twitter.com/cAbLY8POAZ
ఎవరీ శాంత: జే శాంత.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు. కర్ణాటక మాజీ మంత్రి బీ శ్రీరాములు సోదరి. 2009 నాటి ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
హిందూపురంలో ఇద్దరూ మహిళలే: లోక్‌సభ స్థానం నుంచి శాంతను బరిలోకి దింపడం అనూహ్య పరిణామంగా భావిస్తోన్నారు. అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానాల నుంచి మహిళా అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీకి నిలిపినట్టయింది. వైసీపీ నాయకురాలు టీఎన్ దీపిక.. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

బాలయ్య ఇరకాటం: వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఇద్దరూ మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా ఈ రెండుచోట్లా మహిళా అభ్యర్థులు పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications