పవన్ కల్యాణ్‌పై మాట మార్చిన నేత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం ఫలితం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైన గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొచ్చింది. మెగా హీరోలతో పాటు, జబర్దస్త్ నటులు సైతం పవన్ కల్యాణ్ తరుఫున పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీత బలమైన అభ్యర్ది కావడంతో పవన్ గెలుపు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా పిఠాపురంలో పవన్ గెలుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. తాజాగా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిఠాపురంలో పరిస్థితిపై స్పందించారు. పిఠాపురంలో మెజారిటీ ఎంతనే విషయంపైనే చర్చ, బెట్టింగులు నడుస్తున్నాయన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలపై పవన్ స్పందించే విషయంలో ..ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో పవన్ వంటి వ్యక్తి చట్ట సభల్లో ఉండాలని లక్షీనారాయణ అభిప్రాయపడ్డారు.

Former CBI JD Lakshmi Narayana s analysis of Pawan Kalyan s victory in Pithapuram

అలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ఫలితంగా పిఠాపురంలో పవన్ గెలుస్తారనే తాను అనుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ విశ్లేషించారు. ఏపీలో కూటమి జతకట్టడానికి కారణం తానే అని చెప్పుకున్న పవన్... రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీ ప్రయోజనాల విషయంలో కూడా ఆయన పాత్ర కీలకం కానుందని లక్ష్మీనారాయణ తెలిపారు. లక్ష్మీనారాయణ గతంలో జనసేన పార్టీలో పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ టికెట్‌‌పై వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.అనంతరం ఆయన జనసేన విడిచిపెట్టారు. 2019లో జనసేన నుంచి విడిపోయిన బయటకు వచ్చేశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన జై భారత్ పార్టీని స్థాపించి 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. 2019 ఎన్నికల తర్వాత పవన్‌ను విమర్శించిన లక్ష్మీనారాయణ తిరిగి తమ నేత విజయం సాధిస్తారని చెప్పడంపై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+