బెంగళూరులో వైఎస్ జగన్, వైసీపీ లీడర్స్ కే క్లారిటీ లేదు, టీడీపీ చేతికి మరో అస్త్రం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి బెంగళూరు వెళ్లారు. విజయవాడలో వైసీపీ నాయకులతో వరుస బేటీలతో జగన్ బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం దూరం అయిన తరువాత జగన్ పలు జిల్లాల వైసీపీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇదే సందర్బంలో పార్టీ భలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై జగన్ వారితో చర్చించారని తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరవాత ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి వైసీపీ దూరం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరుకు వెళ్లి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత వైసీపీ అధ్యక్షుడు జగన్ తొమ్మిదోసారి బెంగళూరు వెళ్లారని వైసీపీకి చెందిన కొందరు నానయకులు అంటున్నారు.

Former Chief Minister of Andhra Pradesh YS Jagan once again went to Bengaluru

అనుకున్న ప్రకారం అన్ని జరిగి ఉంటే జగన్ ఇప్పటికే లండన్ లో ఉండాలి. ఈనెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు తాను లండన్ పర్యటకు వెలుతానని మాజీ సీఎం జగన్ సీబీఐ కోర్టును ఆనుమతి కోరారు. జగన్ లండన్ పర్యటకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు అననుమతి ఇచ్చింది. అయితే మాజీ సీఎం జగన్ పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొన్ని షరతులు విధించింది.

విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చెయ్యాలని జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో జగన్ లండన్ పర్యటన విషయంలో వైసీపీ నాయకులకే ఓ క్లారిటీ లేదని తెలిసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటన ఉంటుందా ?, వాయిదా వేసుకుంటారా ? అనే విషయంలో ఇంకా స్పష్టతలేదని వైసీపీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.

మరో వైపు బెంగళూరు వెళ్లిన జగన్ వైసీపీ నాయకులతో భేటీ కానున్నారని తెలిసింది. వైసీపీకి చెందిన నాయకులు చాలా మంది బెంగళూరులోనే ఉంటున్నారు. జగన్ ను బెంగళూరులో తీరికగా కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చ జరపడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.ఇంకో విషయం ఏమిటంటే బెంగళూరులో జగన్ ను బేటీ అయినా ఎల్లో మీడియాకు ఎలాంటి సమాచారం అందదని, ఎలాంటి సమస్య ఉండదని వైసీపీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. మొత్తం మీద మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారు అనే విషయంలో వైసీపీ నాయకులకు కూడా సమాచారం లేదని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+