నిండు ప్రాణం కాపాడిన వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పులివెందులలో పర్యటిస్తున్న జగన్ ఈ సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురయిన ఓ యువకుడిని కాపాడారు.కోమన్నూతల గ్రామానికికు చెందిన నరేంద్ర అనే యువకుడు మద్యం మత్తులో నీటిలో పడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న సన్నిహితులు 108 వాహనానికి ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై పులివెందులలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఇదే సమయంలో పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి జగన్ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడేందుకు జగన్ ఆగారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రాణపాయ స్దితిలో ఉన్న యువకుడు నరేంద్రను తరలిస్తున్న విషయాన్ని జగన్ గమనించి.. వెంటనే తన కాన్వాయ్‌లో ఉన్న 108 వాహనంలో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించేలా జగన్ ఏర్పాట్లు చేశారు.కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్ ద్వారా బాధితుడు నరేంద్రను హుటాహుటిన ఆక్సిజన్ సహాయంతో పులివెందులలోని మెడికల్ కళాశాలకు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇక దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రికి నివాళులర్పించారు.యనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని తమ ప్రియత నేతకు ఘనంగా నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications