దక్షిణాదికి అంబేద్కర్ పేరు-ఏపీకి ముందస్తు రాదు- చింతామోహన్ కీలక వ్యాఖ్యలు
నిత్యం తన వ్యాఖ్యలతో సంచలనాలు రేపే కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ ఇవాళ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై వివాదం, వైసీపీ ప్రభుత్వ పనితీరు, ముందస్తు ఎన్నికలు వంటి అంశాలపై చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ జీవితం ఇప్పటి నేతలుకు ఆదర్శమని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ తెలిపారు. కోనసీమలో అంబేద్కర్ గౌరవానికి సమస్య వచ్చిందని ఆయన అన్నారు. ఇతనిని అమలాపురంకి పరిమితం చేయడం తగదన్నారు.దక్షిణ భారత దేశం వంటి ప్రాంతంకి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన సూచించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన చింతా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదన్నారు.

వైసీపీ బస్సు యాత్రపైనా చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సు తుస్సు మని లేచిపోయిందన్నారు..దానికి ప్రాధాన్యత లేదన్నారు. 80లక్షల మంది బిడ్డలకు స్కాలర్ షిప్ లు తీసేశారని, సామాజిక అన్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా న్యాయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ని తీవ్రంగా ఖండిస్తున్నానని చింతా మోహన్ తెలిపారు. కేరళ వంటి 28 రాష్ట్రాల్లో స్కాలర్ షిప్ లు ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం సామాజిక అన్యాయం జరుగుతుందని ఆయన ఆక్షేపించారు.
విశాఖలో ఉక్కు పరిశ్రమ కోసం అమృతారావు 53 రోజులు దీక్ష చేస్తే, సాధిస్తే ఇప్పుడు కష్టాల్లో ఉందని చింతామోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతి లో అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చానని, మన్మోహన్ సింగ్ తో పునాది రాయి వేసి పూర్తి చేశామని, మోడి ప్రారంభం చేశారని ఆయన గుర్తుచేశారు. అయితే దాని ని ప్రైవేటు పరం చేద్దామని క్యాబినెట్ లో పెట్టేశారని ఆక్షేపించరు. ఆపడానికి నేను డిల్లీ వెళ్లి ఇరవై రోజులు కూర్చుని పని పూర్తి చేసుకుని వచ్చానన్నారు.ఉక్కు పరిశ్రమ మన హక్కు. జూన్ తరువాత నన్ను సంప్రదించండి. జులై లో దానిని సాధించడానికి కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications