స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ ఆ ప్లాన్..! జగన్ పై బాంబుపేల్చిన మాజీ సీఎస్..!
గత వైసీపీ ప్రభుత్వంలో సీఎస్ గా వ్యవహరించి, ఆ తర్వాత ఉద్వాసనకు గురైన ఎల్వీ సుబ్రమణ్యం అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ వైఖరిపై తాజాగా ఓ టీవీ ఇంటర్వూలో సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ కు పలు విషయాలు తాను నిర్మొహమాటంగా చెప్పేవాడిని మాజీ సీఎస్ ఎల్వీ వెల్లడించారు. అప్పట్లో ఆయన చుట్టూ చేరిన అధికారులు ధైర్యంగా ఏ విషయం కూడా జగన్ కు చెప్పేవారు కాదన్నారు. ఆయన చెప్పినదానికి తలూపే వారిని సమర్ధులైన అధికారులుగా జగన్ భావించేవారన్నారు. జగన్ గతంలో ఓ భయంకరమైన ఆలోచన తనకు చెప్పాడన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చెప్పిన ప్లాన్ ను ఎల్వీ సుబ్రమణ్యం బయటపెట్టారు.
స్టీల్ ప్లాంట్ తీసేసి ఆ స్ధానంలో కొత్త రాజధాని కడదామని జగన్ అప్పట్లో తనకు చెప్పాడని, దీంతో తాను షాకైనట్లు ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. మనమెవరూ దీన్ని ఊహించలేమన్నారు. తాను దీనిపై జగన్ తో వాదించానన్నారు. దీంతో నీతో వచ్చిన సమస్య ఇది అని జగన్ చెప్పినట్లు ఎల్వీ తెలిపారు. జగన్ అసలు సీఎం పదవికి అర్హుడు కాదన్నారు. సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందన్నారు. మన శ్రేయస్సు కోరే వారిని, త్యాగబుద్దితో పనిచేసే వారిని ఎన్నుకోవాలన్నారు.

రాష్ట్రంలో అనేక మంది నాయకులు చాలా మందే ఉన్నారన్నారు. తాను కూడా అలాంటి వారిని చూశానన్నారు. 83 బ్యాచ్ లో వచ్చిన తాను కూడా త్యాగబుద్దులుగా ఉండేవారిని చూశానన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే వాటి కోసం పనిచేయాలని, అధికారులకు ప్రేరణ ఇవ్వాలని, పార్టీకి చెందిన వారు గాడితప్పి పోతుంటే సరిచేయాలన్నారు. విశాఖలో తాను పెరిగానని, జగన్ కామెంట్స్ చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం ఉందన్నారని, తాను అంగీకరించకపోతే నువ్వు అన్నీ ఇలాగే మాట్లాడతావన్నారని గుర్తుచేసుకున్నారు.

విశాఖ సిటీ మధ్యలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి 33 వేల ఎకరాల్లో రాజధాని కట్టేద్దామన్నారని ఎల్వీ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి ఆలోచనలు అన్నీ జగన్ లో ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయన్నది ఆలోచించాలన్నారు. ఓ సీఎం తల్చుకుంటే సమాజంలో ఏ స్ధాయిలో ఉన్న వారైనా ముందుకొచ్చి తన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారని, కానీ అప్పట్లో వందల మంది సలహాదారులు ఉన్నారని, కానీ వారి సలహాలు వినేందుకు జగన్ ఇష్టపడలేదన్నారు.












Click it and Unblock the Notifications