పవన్ మాజీ సలహాదారు సంచలనం - కాపులు సినిమా వాళ్లను నమ్మితే జరిగేదిదే..!!

ఏపీలో ఇప్పుడు కాపు రిజర్వేషన్లు..వచ్చే ఎన్నికల్లో కాపు ఓటింగ్ పైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయగా పని చేసిన పీ రామ్మోహన రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడవద్దని సూచించారు. ఈ పోరాటం కారణంగా బీసీలకు దూరమయ్యామని చెప్పుకొచ్చారు. తుని ఘటనతో కాపు యువతపై అల్లరి మూకలనే ముద్ర పడిపోయిందన్నారు. సమిష్టి నాయకత్వం కాపుల్లో అవసరమని చెప్పుకొచ్చారు.

సినిమావాళ్లను నమ్ముకొని రాజకీయమా

సినిమావాళ్లను నమ్ముకొని రాజకీయమా

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు ప్రభుత్వంలో సుదీర్ఘ కాలంలో ఆయన అధికారిగా పని చేసారు. 2019లో జనసేనలో చేరారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ సలహాదారుగా నియమించారు. మంగళగిరిలో జరిగిన రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన కాపు సంబంధిత అంశాలపైన స్పందించారు.

సినిమా వాళ్లనో, ఓ పరిశ్రమనో నమ్ముకొని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యమని పేర్కొన్నారు. కులంలో నుంచి సమిష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజిక వర్గం ముందుకు వెళ్తుందని రామ్మోహన రావు వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్ కోసం పోరాడద్దు

బీసీ రిజర్వేషన్ కోసం పోరాడద్దు

కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడద్దని రామ్మోహన్ రావు సూచించారు. గతంలో ముద్రగడ పద్మనాభానికీ ఈ ఈ విషయం తాను చెప్పానన్నారు. ఈ పోరాటం కారణంగా బీసీలకు దూరమయ్యామని వివరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కాపులుగా ఎదిగారని, 38 మంది కాపు నేతలు ఎమ్మెల్యేలు అయ్యారని, పలువురు ఎంపీలు అయ్యారని రామ్మోహనరావు చెప్పుకొచ్చారు. వారికేమీ రిజర్వేషన్లు లేవన్నారు.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాపులకు బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యం కాదన్నారు. అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టిమాటేనని చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు. బీసీలు, ఇతర కులాలను కలుపుకొని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యపడుతుందని రామ్మోహన్ రావు చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రులు అవ్వాలి కదా..

ముఖ్యమంత్రులు అవ్వాలి కదా..

ఇదే సమయంలో మరిన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు 75 ఏళ్ల కాలంగా 20 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వివరించారు. వారు ఈ పాటికే ముఖ్యమంత్రులు అవ్వాలి కదా, ఎందుకు కాలేదని ప్రశ్నించారు. బీసీలతో పాటుగా ఇతర కులాలను కలుపుకొని పోవాలని సూచించారు.

4-5 శాతం ఉన్న జనాభా ఉన్న కులాలు రాజ్యమేలుతున్నారనే తప్పుడు ఆలోచనల్లోకి కాపులు వెళ్లిపోయారని, అది సరి కాదని విశ్లేషించారు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు..సామాజిక సమీకరణాల నేపథ్యంలో రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+