ప్లేస్ మీరు చెప్పినా, నన్ను చెప్పమన్నా.. మాజీ డివ్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సవాల్
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇదే క్రమంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన పుష్పశ్రీవాణి వంతు వచ్చింది. తాజాగా ఆమె ప్రత్యర్ధులకు ఓ సవాల్ విసిరారు.
ఎప్పుడూ నవ్వుతూ కామ్ గా కనిపించే మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. మంత్రి పదవి పోయినా.. నియోజకవర్గంలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ఇందులో హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

ప్లేస్ మీరు చెప్పినా.. నన్ను చెప్పమన్నా.. ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని.. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ పుష్ప శ్రీవాణి ఛాలెంజ్ చేశారు. 2014 ఎన్నికల్లో 14 వేల మెజారిటీ, 2019 లో 26 వేలకు పైగా మెజారిటీ వచ్చిందని.., రాబోయే ఎన్నికల్లో అంతకు మించిన మెజారిటీతో గెలవబోతున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎన్ని విమర్శలు చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. దీంతో నియోజకవర్గంలో ఆమెను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు.












Click it and Unblock the Notifications