Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు పెగాసస్ కొనలేదా ? నిర్దారించిన గౌతం సవాంగ్ - మరి మమత ఎందుకలా చెప్పారు ?

గతంలో జాతీయ స్దాయిలో రచ్చకు కారణమైన పెగాసస్ స్పైవేర్ కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలోనూ రచ్చకు దారి తీస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉండగా పెగాసస్ కొన్నారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఇదే అంశంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ సమాచార హక్కు కింద ఇచ్చిన సమాధానాన్ని టీడీపీ బయటపెట్టింది.

చంద్రబాబు మెడకు పెగాసస్

చంద్రబాబు మెడకు పెగాసస్

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు.. తన ప్రత్యర్ధిగా ఉన్న వైఎస్ జగన్ తో పాటు ఆయన పార్టీ వైసీపీ నేతలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీల నుంచి పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసినట్లు తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అదే సమయంలో చంద్రబాబును టార్గెట్ చేసేందుకు మంచి అస్త్రం లభించడంతో వైసీపీ రంగంలోకి దిగింది. దీంతో టీడీపీ చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడుతున్నారు. దీనిపై స్పందించిన లోకేష్.. టీడీపీ హయాంలో పెగాసస్ కొనలేదని తేల్చిచెప్పేశారు. అయినా విమర్శల జడి ఆగడం లేదు.

పెగాసస్ కొనలేదన్న గౌతం సవాంగ్

పెగాసస్ కొనలేదన్న గౌతం సవాంగ్

టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్ధులపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొన్నారటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద కర్నాలు జిల్లాకు చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి డీజీపీ కార్యాలయాన్ని సమాచారం కోరారు. పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారా లేదా చేస్తే దాని వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన నాటి డీజీపీ 2021 జూలై 25న ఏపీ ప్రభుత్వం ఇప్పటివకూ అలాంటి స్పైవేర్ ఏదీ కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పేశారు. దీంతో పెగాసస్ స్పైవేర్ నుచంద్రబాబు సర్కార్ కొనుగోలు చేయలేదన్న వాస్తవం బయటికొచ్చింది.

 సవాంగ్ జవాబును ట్వీట్ చేసిన అయ్యన్న

సవాంగ్ జవాబును ట్వీట్ చేసిన అయ్యన్న

గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్పైవేర్ కొనుగోళ్లు జరగలేదంటూ అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ ఇచ్చిన సమాధానాన్ని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. దాంతో పాటు చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోలుపై సమాచార హక్కు చట్టం కింద నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నల్ని కూడా ట్యాగ్ చేశారు. దీనికి సవాంగ్ ఇచ్చిన సమాధానాన్ని జత చేస్తూ వైసీపీపై కౌంటర్ అటాక్ కి దిగారు.

 దేవుడి స్క్రిప్ట్ అంటూ అయ్యన్న సెటైర్లు

దేవుడి స్క్రిప్ట్ అంటూ అయ్యన్న సెటైర్లు

అయ్యన్న ఇవాళ చేసిన ట్వీట్ లో ... నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి. సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21 న కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్ 12-8-21న సమాధానం ఇచ్చారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగన్ బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్ అంటూ అయ్యన్న సెటైర్లు వేశారు.

Recommended Video

    Pegasus: TDP, Chandrababu పై Mamata Banerjee సంచలనం YS Jagan పై నిఘా | Oneindia Telugu
     మమతపై టీడీపీ అనుమానాలు ?

    మమతపై టీడీపీ అనుమానాలు ?

    చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారంటూ మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమతకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఇప్పటికే లోకేష్ ఆరోపించారు. ఇప్పుడు మిగతా టీడీపీ నేతలు కూడా మమత ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. మమత చెప్తున్నదే నిజమైతే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమను టార్గెట్ చేసి ఉండేది కదా అని గుర్తుచేస్తున్నారు. దీంతో మమతా బెనర్జీ తీరుపై టీడీపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+