జగన్‌కు షాక్, సుజయ్ అలక: నేనలా అనలేదే.. బొత్స రివర్స్ గేర్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తప్పేలా లేదు. విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరారు. దీని పైన వైసీపీకి చెందిన సుజయ కృష్ణ రంగారావు అలక వహించినట్లుగా తెలుస్తోంది.
సుజయ, బొత్సల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో బొత్స చేరికపై సుజయ అలక వహించారని తెలుస్తోంది. బొత్స పార్టీలో చేరుతున్నప్పటికీ.. సుజయ లోటస్ పాండుకు రాలేదు. బలమైన సామాజిక వర్గం కలిగిన సుజయ్ పార్టీ వీడితే నష్టమేననన అంటున్నారు. సుజయ్‌ను శాంతపరిచేందుకు పలువురు నేతలు రంగంలోకి దిగినట్లుగా సమాచారం.
వైసీపీలో చేరిక సందర్భంగా బొత్సను సుజయ్ కృష్ణ రంగారావు రాకపోవడంపై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ఎందుకు రాలేదో ఆయననే అడగాలని సూచించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బొత్స వైసీపీ అధినేత పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ మంత్రివర్గం సమష్టిగా తీసుకున్నవేనని చెప్పారు. తెర వెనుక జరిగిన వాటితో తమకు సంబంధంలేదని అప్పుడే చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని అన్నారు. అదే సమయంలో తెర వెనుక వ్యవహారాలతో జగన్‌కు సంబంధముందని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అయినా అది కోర్టులో ఉందన్నారు.

బొత్స కుటుంబం
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్.

బొత్స కుటుంబం
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరిన సందర్భంగా...

బొత్స కుటుంబం
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో టీడీపీపై పోరాటం చేస్తామన్నారు.

బొత్స కుటుంబం
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. బొత్స మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ అన్యాయం చేయలేదని, కానీ ఏపీలో టీడీపీపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పారు.

బొత్స కుటుంబం
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వారిలో.. బొత్స సత్యనారాయణష బొత్స ఝాన్సీ, బొత్స అప్పలనర్సయ్య, అప్పల నాయుడు, తులసి, రమణ రాజు, రమణమూర్తి, విజయ్ కుమార్, సూర్యనారాయణ, శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications