2019లో టిడిపిని భూస్థాపితం చేస్తాం: బొత్స

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 2019లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల వ్యూహలను రచిస్తున్నామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

గురువారం నాడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చిందని విమర్శించారు. ఏపీని అనారోగ్యప్రదేశ్ గా మార్చారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Former minister Bosta Satyanaraya slams on Chandarbabunaidu

ఈ నెల 11 నుంచి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశ చరిత్రలో జగన్ ఒక సంచలన నేతగా పేరు గడించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.జగన్ పైకి సీబీఐని ఉసిగొల్పి ఇబ్బందులు కల్పిస్తున్నారని, నాడు పొత్తులు లేకుండా 67 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకోవడం గర్వకారణమని అన్నారు.జగన్ సవాల్‌పై టిడిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Bosta satyanarayana made allegations on Tdp chief Chandarbabunaidu. He spoke to media on Thursday. We will win in 2019 elections he said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి