మాజీ మంత్రి డీఎల్ కీలక నిర్ణయం-మైదుకూరు ఎమ్మెల్యేగా వీరికి.. కడప ఎంపీగా వారికి మద్దతు..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీయే కూటమిగా ఉమ్మడి అభ్యర్ధులను నిలబెట్టడంతో రాష్ట్రంలో ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరగబోతోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులుగా కూటమి నిలబెట్టిన స్ధానాల్లో క్రాస్ ఓటింగ్ ఎలాగో తప్పదు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం భిన్న పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ తప్పేలా లేదు.
కడప జిల్లాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లకు ఇవాళ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా గతంలో తాను పలుమార్లు గెలిచిన మైదుకూరు సీటులో ఎవరికి ఓటేయాలో, కడప ఎంపీగా ఎవరికి ఓటు వేయాలన్న దానిపై డీఎల్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఆసక్తికరంగా ఉంది. మైదుకూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ కు ఓటేయాలని డీఎల్ పిలుపునిచ్చారు. అయితే కడప లోక్ సభ స్ధానంపై మాత్రం పరోక్షంగా ఓ పిలుపు ఇచ్చారు.

కడప లోక్ సభ సీటులో వివేకం సినిమా చూసి ఓటేయాలంటూ డీఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంటే ఈ సినిమాలో చూపించినట్లుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత బాధితులుగా మారిన ఆయన కుటుంబం మద్దతిస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేయాలని డీఎల్ పరోక్షంగా చెప్పినట్లయింది. అసలే కడప లోక్ సభ సీటులో అవినాష్ వర్సెస్ షర్మిల వార్ కొనసాగుతున్న నేపథ్యంలో డీఎల్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఏపీలో ఆ జిల్లాల్లో పెనం మీద ఉన్నట్టే- అత్యధిక ఉష్ణోగ్రత -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications