వివేకా హత్య డీల్ లోకేష్ కు ఎలా తెలుసు ? గన్నవరం ప్లాన్ బాబుదే ! కొడాలి కామెంట్స్..
ఏపీలో గన్నవరం ఘటనలు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కౌంటర్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ మంత్రి కొడాలి నాని ఘాటు కౌంటర్లు ఇచ్చారు.
ఏపీలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి, వైఎస్ వివేకా కేసులో సీబీఐ హైకోర్టులో వేసిన కౌంటర్ రాజకీయాల్ని పూర్తిగా హీటెక్కించాయి. గన్నవరం ఘటనల్లో టీడీపీ నేత పట్టాభి తీరుపై వైసీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ దీంతో కలిపి వైఎస్ వివేకా కేసులో సీబీఐ, ఎల్లో మీడియా తీరుపై ఫైర్ అయ్యారు.
గన్నవరం ఘటనలకు కారణమైన టీడీపీ నేత పట్టాభి పనికిమాలిన 420 అని కొడాలి విమర్శించారు. పట్టాభి చుట్టూ రాజకీయాలు తిప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపారని ఆయన ప్రశ్నించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థుతులు అందరూ చూస్తున్నారన్నారు.
రాష్ట్రంలో నేనే బ్రహ్మ, విష్ణు మహేశ్వరుడునని, అనుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ నీ పొట్టను పెట్టుకున్న వ్యక్తులు రామోజీరావు, చంద్రబాబు అన్నారు. దొంగరాతలు రాసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్టీఆర్ ని కుంగదీశారన్నారు.

గన్నవరం వెళ్లి వంశీనీ పిల్ల సైకో రారా గన్నవరం వచ్చా అమ్మ, అబ్భకి పుట్టుంటే అని అంటే ఊరుకుంటారా,కర్ర పట్టుకుని వంశీని, వంశీ మనుషులుని కొట్టాలని వెళ్లి సిఐ బుర్ర పగలగొట్టాడన్నారు. సీఐ తలపగలకొడితే కేసు పెట్టకుండా,ఏమి చేస్తారని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అని పట్టాభి డ్రామా,రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. త్వరలో ఈ 420 గాళ్ళందరికి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారన్నారు.
మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పై టీడీపీ చేస్తున్న విమర్శల్ని కొడాలి తీవ్రంగా ఖండించారు. సీబీఐని బ్యాన్ చేసిందే చంద్రబాబని, చంద్రబాబు అడుగుజాడల్లో సీబీఐ పనిచేస్తోందన్నారు. వివేకా కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగినట్లు లోకేష్ కు ముందే ఎలా తెలుసని కొడాలి ప్రశ్నించారు.సీబీఐ కౌంటర్ వేయకముందే అందులో ఉన్న విషయాలు లోకేష్ కు తెలియడాన్ని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications