Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడాలి నానీకి కొల్లు రవీంద్ర వార్నింగ్.. బందర్ రా.. చిటికెన వేలితో లేపేస్తా అంటూ హెచ్చరిక

మాజీమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుకి జరిగిన అవమానం, చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన తరువాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన మచిలీపట్నం పార్లమెంటు టిడిపి కార్యాలయంలో జరిగిన ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో కొల్లు రవీంద్ర వైసీపీ మంత్రి కొడాలి నానీని టార్గెట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ ఎమ్మెల్యేల దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు తెలుగుదేశం పార్టీ రాజకీయ బిక్ష పెడితే, వారు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విశ్వాస ఘాతకులుగా మారారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్నారని, ప్రజా ప్రతినిధులు హద్దు దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆడపడుచులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

బందర్ రా .. చిటికెన వేలితో లేపేస్తా... కొడాలి నానీకి వార్నింగ్

బందర్ రా .. చిటికెన వేలితో లేపేస్తా... కొడాలి నానీకి వార్నింగ్

కొడాలి నానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కొల్లు రవీంద్ర కొడాలి నాని.. బందర్ రా.. చిటికెన వేలితో లేపేస్తా.. మీకు రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుని తిట్టేంత వాడివా అంటూ కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. ఇక పేర్ని నాని సొంత నియోజకవర్గంలో బందర్ బస్టాండ్ ముంపుకు గురి అవుతుంటే పట్టించుకోలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు . అధికార పార్టీ నాయకులు విలువలు మరచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అన్నీ రాసి పెట్టుకుంటున్నామని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు.

బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారు: మండలి బుద్ధ ప్రసాద్

బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారు: మండలి బుద్ధ ప్రసాద్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఎంతో గౌరవప్రదమైన శాసన సభలో కొందరు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు. మంత్రులకు సొంత శాఖలపై పట్టులేదని బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మండలి బుద్ధ ప్రసాద్. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా వైసిపి పాలనపై నిప్పులు చెరిగారు. గడిచిన 30 నెలల్లో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా అంటూ నిలదీశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలిగారా? అంటూ ప్రశ్నించారు.

ఆడపడుచుల ఆత్మ గౌరవ సభలలో వారికి బుద్ధి చెప్పాలంటున్న టీడీపీ మహిళా నాయకులు

ఆడపడుచుల ఆత్మ గౌరవ సభలలో వారికి బుద్ధి చెప్పాలంటున్న టీడీపీ మహిళా నాయకులు

అసెంబ్లీలో చంద్రబాబుకి జరిగిన అవమానం, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కూడా నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ నాయకుల తీరును ఎండగడుతున్నారు. ఆడపడుచుల ఆత్మ గౌరవ సభలు నిర్వహిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్నడూ కన్నీరు పెట్టని చంద్రబాబును కన్నీరు పెట్టించిన వైసీపీ ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్తామని వారంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+