చంద్రబాబుతో పరిటాల ఫ్యామిలీ ప్రత్యేక చర్చలు, మంత్రి పదవి ?, అనంత జిల్లాలో టెన్షన్ !!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిగా తాను ప్రతిపాదిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పతిపాధించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా నారా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసన సభాపక్షం నేతగా ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు వారం రోజులు అవుతున్నా కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఇంతకాలం అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షానికి పరిమితం అయ్యి తాము ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తామా అని ఎదురు చూసిన టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు అనుకున్నది సాదించి మంచి జోష్ మీద ఉన్నారు.

ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలో ఇంతకాలం జెండా ఎగరేసిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునిత ఎమ్మెల్యేగా విజయం సాదించారు. తన కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి విజయవాడలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన పరిటాల సునిత పార్టీ అధినేతను సన్మానించారు.
రాప్తాడుతో మళ్లీ పార్టీ జెండా ఎగరవేశామని పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కాబోయే సీఎ: చంద్రబాబుకు చెప్పారు. రాప్తాడులో ఇంతకాలం చాలా ఓపికగా అన్ని సమస్యలను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు మిమ్మల్ని తాను అభినందిస్తున్నానని, త్వరలో మీకు మంచి రోజులు వస్తాయని చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కు చెప్పారని తెలిసింది. ధర్మవరంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
అయితే అన్ని కలిసి వచ్చింటే ధర్మవరం బీజేపీకి ఇవ్వకుండా ఉండివుంటే ఆ నియోజక వర్గంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేసేవాడు. అయితే ధర్మవరం టిక్కెట్ బీజేపీకి ఇవ్వడంతో పరిటాల శ్రీరామ్ ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పరిటాల సునీతకు మంత్రి పదవి ఇవ్వాలని పరిటాల అభిమానులు చంద్రబాబుకు మనవి చేశారని తెలిసింది. అయితే పరిటాల సునీతకు మంత్రి వస్తుందా ? లేదా అని పరిటాల వర్గీయులు టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications