హిట్లర్, గడాఫీ కలిసి పాలన చేస్తున్నట్టు.. చంద్రబాబుపై రోజా షాకింగ్ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టుల పైన రెచ్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని టిడిపి నేతలు చేసిన ఫిర్యాదులతో వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై తనదైన శైలిలో మండిపడ్డారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మాజీమంత్రి రోజా ఫిర్యాదు
అంతేకాదు వైసిపి నేతలపై మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.
ఏపీ మాజీ సీఎం జగన్ పైన, ఆయన భార్య భారతి, వైసిపి నేతల పైన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలను, మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని రోజా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైసీపీ ఫిర్యాదులు తీసుకోవటానికి పోలీసులకు భయం
ఎలాంటి తప్పు చేయకపోయినా తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా పేర్కొన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్టు రసీదు ఇవ్వడానికి పోలీసులు నానా హైరానా పడుతున్నారని రోజా అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు కూటమిలోని మూడు పార్టీలకు సెల్యూట్ చేస్తున్నాయని రోజా మండిపడ్డారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి న్యాయం చేయాలన్నారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ కలిసి పాలన చేస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయని రోజా తెలిపారు. వైసిపి హయాంలో ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని, అయినా తాము ఇలా వ్యవహరించలేదన్నారు. ప్రస్తుతం ఏ తప్పు చేయని వారిపైన కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఏపీలో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడిన రోజా తప్పు చేయని వారిపైన కేసులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం ఏం చేస్తున్నారు
ఎన్డీఏ కూటమినేతలు తప్పులు చేస్తూ తప్పు చేయని వారి పైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రోజా అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల మంది మహిళలు యువతీ యువకులు అదృశమయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని విమర్శలు చేశారని, తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇక అసెంబ్లీ వేదికగా 36 మందే అదృశ్యమయ్యారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారని రోజా తెలిపారు. చంద్రబాబు పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో ప్రజలకు వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications