పవన్ కళ్యాణ్.. నువ్వా నీతులు చెప్పేది; తాట తీస్తాం: మాజీమంత్రి వెల్లంపల్లి వార్నింగ్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు.
సీఎం జగన్ ను ఇకపై ఏక వచనంతో పిలుస్తాను అన్న పవన్ కళ్యాణ్ మాటలకు మండిపడిన వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రజల కోసం ఇంత మంచి చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తే తాట తీస్తాం అంటూ హెచ్చరించారు. ఆయనను ఏకవచనంతో సంబోధించి నువ్వు రోడ్డుపై తిరగ గలవా అంటూ ప్రశ్నించారు.

వారాహి యాత్ర పేరుతో ఆ బండి మీద నిలబడి ఊరపందిలా మాట్లాడడం కాదని, ఒకసారి తమ ప్రాంతాలకు వస్తే ప్రజలకు జరిగే మేలు కనిపిస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పగలేమో బీజేపీతో సంసారం రాత్రి ఏమో ఏపీ తో కాపురం చేస్తాడని ఇలాంటి వ్యక్తి మనకు నీతులు చెబుతున్నాడని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను బ్యాన్ చేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నానని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వ్యక్తి అని, అక్కడ ఉంటూ ఆంధ్రలో రాజకీయం చేస్తాడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో యాక్ట్ చేస్తే రోజుకు రెండు కోట్లు వస్తాయని, కానీ చంద్రబాబుతో కలిసి యాక్ట్ చేస్తే 10 కోట్ల ప్యాకేజీ ఇస్తాడు అంటూ సెటైర్లు వేశారు.
ఇలాంటి వెధవలను ప్రజలు ఎవరూ నమ్మరని వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ నోట్లో లాలీపాప్ పెట్టుకున్నాడా అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకు అవసరమా అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications