Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజారాజ్యం, జనసేనల్లో ఆ ఒక్కడే అసలైన కోవర్ట్: జాగ్రత్త పడుతున్న బీజేపీ

విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి ఇదివరకు నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ కాలక్రమేణా కనుమరుగు కావడానికి వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు మంత్రులు, మాజీ మంత్రులే కారణం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజారాజ్యంలో కోవర్టులుగా పని చేశారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 అసలైన కోవర్ట్..

అసలైన కోవర్ట్..

ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కల్యాణేనని ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పరితమిస్తోన్నాడే తప్ప తాను అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదని అన్నారు. ఈ రకంగా చూస్తే పవన్ కల్యాణ్ ఇప్పుడు కూడా తన సొంత పార్టీలోనే కోవర్ట్‌గా పని చేస్తోన్నాడని ఆరోపించారు. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు.. తాను అధికారంలోకి రావాలి.. ప్రజలకు మంచి చేయాలి అని తపించాలే తప్ప మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు.

 ఎన్నికల ఫలితాలు రాగానే బయటికి వెళ్లాడు..

ఎన్నికల ఫలితాలు రాగానే బయటికి వెళ్లాడు..

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన మొట్ట మొదటి వ్యక్తి పవన్ కళ్యాణేనని వెల్లంపల్లి అన్నారు. ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ చివరి వరకూ పార్టీకి అండగా నిలువలేకపోయాడని విమర్శించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పీకాడని నిలదీశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి మొదటి కారకుడు కూడా పవన్ కళ్యాణేనని ధ్వజమెత్తారు.

చిరంజీవితో చివరి వరకూ..

చిరంజీవితో చివరి వరకూ..

అలాంటి వ్యక్తి.. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమను విమర్శించడం అతని రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం తరఫున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలందరు చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లో కొనసాగారని అన్నారు. సినిమా ఫంక్షన్‌లల్లో చిరంజీవిని అవమానించే విధంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ కాదా అని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు.

 చిరంజీవి అవసరం వచ్చిందా?

చిరంజీవి అవసరం వచ్చిందా?

జనసేన పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు చిరంజీవి అవసరం పవన్ కల్యాణ్‌కు వచ్చిందని చురకలు అంటించారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- చిరంజీవికి మధ్య గల సన్నిహిత సంబంధాలను తెంచడానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ సహకరించాడనేది వాస్తవమా? కాదా? అని అన్నారు.

సీఎం కావాలనే ఆలోచన లేదు..

సీఎం కావాలనే ఆలోచన లేదు..

ఈ రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించాడని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌కు తాను ముఖ్యమంత్రి కావాలని కాని, కాపు సామాజిక వర్గానికి అండగా నిల్చోవాలనే ఉద్దేశం గానీ లేదని వెల్లంపల్లి తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 20 చోట్ల పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వేర్వేరుగా వచ్చినా, కలిసి వచ్చినా ఓడిపోవటం ఖాయమని అన్నారు.

బీజేపీ ముందుజాగ్రత్త..

బీజేపీ ముందుజాగ్రత్త..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ తమతో చివరి కలిసి ఉంటాడని మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నమ్మకం లేదని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అందుకే ముందుజాగ్రత్తగా ఒక రాజకీయ పార్టీగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉండబోడని, ప్యాకేజీ కోసం చంద్రబాబుకు అమ్ముడుపోతాడని వెల్లంపల్లి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+