టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై?

TDP Janasena BJP alliance: ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.

టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కే అప్పల్నాయుడు, యనమల కృష్ణుడు, కేఎస్ జవహర్, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్, పితాని బాలకృష్ణ.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. వారిలో కొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోండగా.. మరికొందరు పార్టీని వీడారు.

Former MLA Attar Chand Basha to join in YSRCP

పితాని బాలకృష్ణ.. జనసేనకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పితాని బాలకృష్ణ చేరిక.. గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని చేకూర్చినట్టయింది.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు అత్తర్ చాంద్ భాషా కూడా బయటికి రావడం దాదాపుగా ఖాయమైంది. టీడీపీకి గుడ్‌బై చెప్పాాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారని సమాచారం.

సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తర్ చాంద్ భాషాకు టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చాంద్ భాషా.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కదిరి నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. టీడీపీ కండువా కప్పుకొన్నారు.

2019 ఎన్నికల సమయంలోనే ఆయనను పక్కనపెట్టారు చంద్రబాబు. టికెట్ ఇవ్వలేదు. కందికుంట వెంకటప్రసాద్‌నే బరిలో దింపారు అప్పట్లో. ఈ సారి కూడా కదిరి టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందికుంటకే ఇచ్చారు. దీనితో టీడీపీని వీడాలని చాంద్ భాషా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+