వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు దెబ్బ: బిజెపికి మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్య రాజీనామా, టిడిపిలో చేరిక, క్యూలో మరికొందరు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరారు. మంగళవారం రాత్రి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరారు. మరికొందరు బిజెపి నేతలు కూడ త్వరలో టిడిపిలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

పొత్తు తెంచుకొంటే మేలే: బిజెపి, రాజకీయ సమీకరణాల్లో మార్పులుపొత్తు తెంచుకొంటే మేలే: బిజెపి, రాజకీయ సమీకరణాల్లో మార్పులు

ఏపీలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపడుతున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ వల వేస్తున్నారు.

అవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనంఅవిశ్వాసంతో ఒక్కరోజుకే, బిజెపిపై అసంతృప్తి: బాబు సంచలనం

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నుండి ఫిరాయింపులు కూడ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?

రాజకీయంగా రానున్న రోజుల్లో అనేక మార్పులు చేర్పులు సంభవించే అవకాశం ఉందంటున్నారు నేతలు.

పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరిక

పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరిక

మాజీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాకు చెందిన బిజెపి నేత పట్నం సుబ్బయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం రాత్రి టిడిపిలో చేరారు. తన అనుచరులతో కలిసి సుబ్బయ్య టిడిపిలో చేరారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరేలా చక్రం తిప్పారని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.

బిజెపి నుండి వలసలు

బిజెపి నుండి వలసలు


ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బిజెపితో పొత్తును టిడిపి తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది.కొందరు బిజెపి నేతలు టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా బిజెపికి నష్టమే..

బిజెపిని విలన్‌గా చూపుతున్న పార్టీలు

బిజెపిని విలన్‌గా చూపుతున్న పార్టీలు


ఏపీ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇస్తానన్న హమీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ ఇదే అంశాలను ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కల్గించేలా చేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా తమకు నష్టం చేస్తున్నాయని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

బిజెపికి దెబ్బేనా

బిజెపికి దెబ్బేనా


2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరారు. ఆ ఎన్నికల సమయంలో కొందరు పోటీ చేశారు. మరికొందరు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మాత్రం బిజెపికి అనుకూలంగా లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ పరిణామాలు బిజెపికి నష్టం చేసే విధంగా ఉన్నాయి. అయితే రాజకీయంగా దెబ్బతినకుండా ఉండేందుకు బిజెపి ప్రయత్నాలను చేస్తోంది.

English summary
former MLA Patnam Subbaih joined in TDP at Amaravathi on Tuesday night. Subbaiah resigned to Bjp joined in Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X