Kesineni Nani:వైజాగ్ ఈజ్ ఫర్ సేల్-కేశినేని నాని మరో సంచలనం..!
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ అయిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఆయన సోదరుడు, తనను ఎన్నికల్లో ఓడించి ఎంపీ అయిన కేశినేని చిన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం దాడులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో వైజాగ్ లో ఉర్సా క్లస్టర్స్ కు చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూకేటాయింపుల్ని టార్గెట్ చేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం విశాఖలో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూకేటాయింపులపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 3 వేల కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా స్టార్టప్ సంస్థకు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ తాజాగా అమెరికాలో ఉన్న కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టుల్ని, పార్టీ నేతల్ని అందులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించింది. అనుమానాల నివృత్తి పేరుతో ఏర్పాటు చేసిన ఈ జూమ్ కాల్ అవే అనుమానాల్ని మరింతగా పెంచింది.

దీనికి ముందే ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపుల వెనుక విజయవాడ ఎంపీ, తన సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడని, సదరు సంస్ధలో ప్రమోటర్ ఒకరు ఆయన క్లాస్ మేట్ అంటూ కేశినేని నాని ఆరోపణలు చేసారు. దీనిపై నిన్న జూమ్ కాల్ లో స్పందించిన సదరు ప్రమోటర్ ఆయన తనకు సీనియర్ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో నాని చేసిన ఆరోపణలపై సైకో అంటూ కేశినేని చిన్ని రెచ్చిపోయారు. దీనిపై ఇవాళ నాని మళ్లీ స్పందించారు.
ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా తనను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దో ... ది అన్నా సైకో అన్నా నో ప్రాబ్లెమ్ ఒకటైతే ఖాయం వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అంటూ కేశినేని నాని తన సోదరుడికి కౌంటర్ ఇచ్చారు. అలాగే ఈ డీల్ కు సంబంధించి ఓ వెబ్ సైట్ లో ఉన్న పత్రాల్ని కూడా తన ఫేస్ బుక్ పోస్టుకు నాని జత చేశారు. తద్వారా ఎవరేమనుకున్నా వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై చిన్ని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications