వైఎస్సార్ కుటుంబంపై ప్రణబ్‌కు ఎంతో ప్రేమ- మృతి జీర్ణించుకోలేకపోతున్నామన్న మేకపాటి....
దివంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైసీపీకి ఎంతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ బంధం ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్‌తోనూ సాగింది. ముఖ్యంగా ఆరంభంలో బాలారిష్టాలను ఎదుర్కొన్న వైసీపీకి ప్రణబ్ రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక కూడా ఈ అనుబంధం అలాగే సాగింది. ఇప్పుడు ప్రణబ్ మరణంతో వైసీపీ నేతలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
Recommended Video
ప్రజ్ఞాపాటవాలకు నిలువెత్తురూపమైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. మేధావి, రాజనీతిజ్ఞులు, నిజాయతీపరుడైన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం జీర్ణించుకోలేని వార్తని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో దాదాతో ఉన్న అనుబంధాన్ని ఆయన మీడియాతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ప్రధాన మంత్రి పదవి మినహా దేశంలోని అన్ని ఉన్నత పదవులలోనూ అభివృద్ధికై నీతి, నిజాయతీగా కృషి చేసిన అపర చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ అని మేకపాటి పేర్కొన్నారు.

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబపై ప్రణబ్ చూపిన ప్రత్యేక ప్రేమ, ఆదరణ చిరకాలం గుర్తుండే మంచి జ్ఞాపకాలని రాజమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు రాష్ట్రపతి అయిన తరువాత ప్రణబ్ ను కలిసినప్పుడు ప్రణబ్ ఎంతో ఆప్యాయతతో స్పందించిన తీరును మేకపాటి గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాతో సమావేశమైనపుడూ జగన్ ను వాత్సల్యంగా పలకరించిన విధానాన్ని రాజమోహన్ రెడ్డి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. దేశానికి 13 రాష్ట్రపతిగా పోటీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ ఏకాభిప్రాయంతో మద్దతు ఇవ్వడాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

5 దశాబ్దాల రాజకీయ,ప్రజా జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ కృషి, సేవలని కొనియాడారు. గతంలో నాగపూర్ ఆర్ఎస్ఎస్ సమావేశానికి ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లి ప్రణబ్ ప్రసంగించిన తీరు ఆయనలోని కూడా లౌకికవాదానికి నిదర్శనమన్నారు. లైబ్రరీ కమిటీ సభ్యుడిగా ప్రణభ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ గా తాను ఉన్నపుడు వ్యక్తిగతంగా ఆయనతోగల సాన్నిహిత్యాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications