పవన్ అసలు ఉద్దేశం అదే, అందుకే బీజేపీ డైరెక్షన్‌లో..: మాజీ ఎంపీ సబ్బంహరి సంచలనం

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీరుపై మాజీ ఎంపీ సబ్బం హరి అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ తీరుతో ఆయన పార్టీకే నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానన్న పవన్.. ఇప్పుడు సైలెంట్‌గా ఎందుకు ఉన్నారు? అసలు జేఎఫ్‌‌సీ కమిటీ నివేదిక ఏమైందని హరి ప్రశ్నించారు.

బుధవారం ఓ చానెల్‌తో సబ్బం హరి మాట్లాడారు. బీజేపీ డైరెక్షన్‌ ప్రకారమే పవన్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ సూచనల మేరకు పవన్ నిరాహార దీక్ష చేస్తారని సమాచారం ఉందని, విషయం బయటపడటంతో వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తుందన్నారు.

sabbam-hari

మోడీయే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని అందరికీ తెలుసుని, ఇంకా మోడీపై నమ్మకం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని సబ్బంహరి వ్యాఖ్యానించారు.
రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలని పవన్ చూస్తున్నారని సబ్బం హరి వ్యాఖ్యానించారు.

బీజేపీ ఉచ్చులో పడితే.. జగన్, పవన్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ఆరాటంతో తప్పుదోవలో వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీతో ఎవరు వెళ్లినా ఉపయోగం శూన్యం అని సబ్బంహరి అభిప్రాయపడ్డారు.

కేవలం కేసుల భయంతోనే జగన్ బీజేపీ వెంట నడుస్తున్నారని సబ్బంహరి చెప్పారు. బీజేపీతో కలిస్తే రాజకీయంగా నష్టమని జగన్‌కు తెలుసునని, అందుకే ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మోడీని జగన్, విజయసాయిరెడ్డి తిడితే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+