వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌ను ఎండగట్టిన ఉండవల్లి: నా ప్రాణం ఉన్నంత వరకూ

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్త.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆధారంగా చేసుకుని ఆయన పలు ఆరోపణలు చేశారు. వాటన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

ఎప్పటికీ పూర్తి కాదు..

ఎప్పటికీ పూర్తి కాదు..

ఈ ఉదయం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇదివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై పలు విమర్శలు చేసిన ఆయన ఈ సారి తన తీవ్రతను పెంచారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని జోస్యం చెప్పారు. పోలవరం రిజర్వాయర్ నిర్మాణం చేయాలంటే నిర్వాసితులకు భారీగా పరిహారాన్ని చెల్లంచాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

కేంద్రమే ఆధారం..

కేంద్రమే ఆధారం..


అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని, కేంద్రంపైనే ఆధార పడాల్సి ఉందని చెప్పారు. కేంద్రం సానుకూలంగా స్పందించిన నిధులను మంజూరు చేస్తే గానీ ప్రాజెక్ట్ పూర్తి కాదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందని, నిర్మాణం పూర్తి కావడానికి సరిపడేలా నిధులను ఇస్తుందని తాను అనుకోవట్లేదని చెప్పారు. పోలవరం పూర్తి కాదని తాను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. తాను బతికి ఉండగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి..

శ్వేతపత్రం విడుదల చేయాలి..


వరద ముంపునకు గురైన గోదావరీ పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. నిర్వాసితులకు 20,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అప్పట్లో వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. పునరావాసం కింద చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది ముఖ్యమంత్రే చెప్పారని పేర్కొన్నారు.

ఎంత ఖర్చు చేశారు?

ఎంత ఖర్చు చేశారు?

గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ పనులపై చేసిన ఖర్చు, ఎంత వ్యయం చేశారనే విషయంపై సరైన అంచనాలు లేవని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందనేది శ్వేతపత్రం ద్వారా వివరించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఎన్నో అవాంతరాలు..

ఎన్నో అవాంతరాలు..

రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ తన హయాంలోనే అనేక తప్పులు చేసిందని, జాతీయ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని చంద్రబాబు దాన్ని స్వీకరించడం తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నో అవాంతరాలు ఉన్నాయని, అందువల్లే తాను జీవించి ఉండగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదని నమ్ముతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

English summary
Former MP Vundavalli Arun Kumar demands for White Paper on construction of Polavaram Project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X