రుషికొండ కాటేజీల కూల్చివేత, దొంగ చేతికి తాళం ఇస్తారా?, రోజా మాజీ ఓఎస్ డి
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను బయటకు రాకుండా చూడటానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న కొందరు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం లో పర్యాటకాభివృద్ధి సంస్థలో పనిచేసిన కొందరు అధికారులు ఇప్పుడు కూడా ఆ పార్టీ నాయకులకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలు బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రుషికొండపై అక్రమంగా నిర్మించిన కాటేజీలు కూల్చేసేటప్పుడు అందులో ఉండే కోట్లాది రూపాయల విలువైన డైనింగ్ టేబుల్స్, సోఫాలు, మంచాలు, ఏసీలు తదితర విలువైన వస్తువులను కొందరు అధికారులు మాయం చేశారని వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను బయటకు లాగాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

గత వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీ నాయకులకు వంతపాడిన అధికారులను ఇప్పుడు విచారణ అధికారులుగా నియమించడం వివాదాలకు కారణమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్ కే రోజా దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన రాజారాం మనోహర్ ను రుషికొండపై నిర్మించిన కాటేజీలను కూల్చేసే బాధ్యతలు, వాటి విచారణ బాధ్యతలను అప్పగించడంపై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అప్పటి మంత్రి ఆర్ కే రోజా తీసుకున్న నిర్ణయాలకు అన్నింటికి తానే ముందుండి నడిపించిన అప్పటి ఆమె ఓఎస్ డి రాజారాం మనోహర్ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు బయట పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన రాజారాం మనోహర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అప్పటి మంత్రి ఆరేకే రోజా దగ్గర ఓఎస్ డీ గా పనిచేశారు.
అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే ముందు వరకు రోజా దగ్గర ఓఎస్ డీగా పనిచేసిన రాజారాం మనోహర్ ఆ తర్వాత డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో మార్కెటింగ్, విజిలెన్స్ విభాగంలో జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి మంత్రి రోజా దగ్గర కీలక బాధ్యతల్లో వ్యవహరించిన రాజారాం మనోహర్ ఇప్పుడు అదే వైసీపీ నాయకుల తప్పిదాలను వెలుగులోకి తీయమంటే ఎలా తీస్తారు ? అని కొందరు కూటమి ప్రభుత్వంలోని నాయకులు ప్రశ్నిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు బయటకు తీయాలంటే ఆ పార్టీకి సహకరించకుండా న్యూటల్ గా పని చేసిన అధికారులను విచారణ అధికారులుగా నియమించాలని కొందరు టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల భజన చేసిన అధికారులను ఇప్పుడు విచారణ అధికారులుగా నియమించడం పలు ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీ, విజిలెన్స్ శాఖలతో రుషికొండ కాటేజీల నిర్మాణంపై విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వంలోని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రుషికొండ కాటేజీల కూల్చివేత విషయంపై తూతూ మంత్రంగా విచారణ జరిపిన రాజారాం మనోహర్ ఆ వేదికను కూటమి ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది రుషికొండ కాటేజీ నిర్మాణం, వాటి కూల్చివేత విషయంపై రాజారాం మనోహర్ సక్రమంగా విచారణ జరపలేదని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications