మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు: పరిస్థితి ఆందోళనకరం

విశాఖపట్నం: మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కావలి ప్రతిభా భారతికి శుక్రవారం గుండెపోటు వచ్చింది. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య(92) అనారోగ్యంతో విశాఖలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన్ని చూసేందుకు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లిని ప్రతిభాభారతికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి విషమంగా ఉందని, షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని వైద్యులు వెల్లడించారు.

 Former Speaker Pratibha Bharathi hospitalized after heart attack

ప్రతిభా భారతికి తండ్రితో అనుబంధం ఎక్కువ అని, ఆయన పరిస్థితి చూసి ఆందోళనకు గురికావడంతోనే ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్ తెలిపారు. ప్రతిభా భారతికి ఆస్పత్రిలో చేర్పించారిన తెలిసి పలువరు నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ప్రతిభా భారతికి చంద్రబాబు ఫోన్

ప్రతిభా భారతికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిభా భారతి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

{document1}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+