జగన్ మళ్లీ పాదయాత్ర చేయాలి-టీడీపీ మాజీ మంత్రి డిమాండ్...

ఏపీలో వైఎస్ జగన్ ఐదేళ్ల క్రితం చేసిన పాదయాత్ర, అది అందించిన ఫలితాలు అంతా చూశారు. వైసీపీకి చరిత్రలోనే కనివినీ రీతిలో భారీ మెజారిటీ అందించడమే కాకుండా విపక్షాలను రాష్ట్రంలో నామమాత్రంగా మార్చేసిన ఆ పాదయాత్రను ఇప్పుడు సీఎంగా జగన్ చేపడితే ఎలా ఉంటుంది ? ఇప్పుడు ఇదే అంశాన్ని టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు తెరపైకి తెచ్చారు. జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలని ఆయన కోరుతున్నారు.

నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇవాళ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ సీఎం వైఎస్సార్ చాలా పెద్ద మనిషని, ఆయనకు ఈ దుర్మార్గుడు పుట్టాడంటూ అయ్యన్న జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ మంత్రి రోజా శాఖ ఏంటి? నా సొగసు చూడండి అంటుందని ఎద్దేవా చేశారు. బీసీ మంత్రి ఎన్ని సబ్ కులాలు ఉన్నాయో చెప్పాలంటూ ప్రశ్నించారు.

 jagan

అనంతపురం ఎంపీ ఫ్యాంట్ విప్పుతాడని, మంత్రి చొక్కా విప్పుతాడని అయ్యన్న హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి తెలియదని, విశాఖకి చెందిన మాజీ మంత్రి గంట చాలు అంటాడని, ఎందుకు గంట ? అని ప్రశ్నించారు. బియ్యం దొంగ ఒకడు, మట్టి దొంగ మరొకడు అంటూ వైసీపీ మంత్రులపై అయ్యన్న రెచ్చిపోయారు. ఈ దుర్మార్గుడు గత ప్రభుత్వం పెట్టిన మంచి కార్యక్రమాలు రద్దు చేసాడంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ayyana-patrudu

దమ్ముంటే సీఎం బయటకు వచ్చి ఇప్పుడు పాదయాత్ర చేయాలంటూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి అయ్యన్న డిమాండ్ చేశారు.56 కార్పొరేషన్లు పెట్టాడు, ఒక్కడికి కుర్చీ లేదన్నారు. ఎన్టీఆర్ కి రాజకీయాలు తెలియవని, అందుకే మంచి పనులు చేసాడని గుర్తుచేశారు. 2000 మంది పోలీసులు లేకపోతే బయటకి రాలేని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, మనలో ఎవరికి అయినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళితే మంచి జరుగుతుందని, కానీ వైసీపీ వాళ్ళు చర్లపల్లి జైలుకి వెళ్ళితే ముఖ్యమంత్రి మంత్రులు అవుతారని అయ్యన్న వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+