Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉండవల్లీ ఊసరవెల్లి ఎందుకయ్యావ్ ? అయ్యన్నపాత్రుడు ఫైర్- వ్యక్తిత్వం కోల్పోవద్దని హితవు..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లిని ఊసరవెల్లిగా అభివర్ణిస్తూ విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉండవల్లి తీరుపై ఫైర్
అయ్యారు. ఆయన వ్యక్తిత్వం కోల్పోవద్దని హితవు పలికారు.

ఉండవల్లి బాగా చదువుకున్నారని, రాజకీయాల్లో సీనియర్ అని, అయినా ఊసరవెల్లి అనే పరిస్ధితికి ఆయన ఎందుకొచ్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టులో ఉండవల్లి కేసు వేశారని, అసలు ఆ కేసులో ఏమైనా పస ఉందా? అని ప్రశ్నించారు. ఆ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారమైనా ఉందా? డబ్బులు ఏదైనా చంద్రబాబు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వెళ్లినట్లు ఆధారం ఉందా? చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే... దానికి ఉండవల్లి సహకరిస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు.

ayyannapatrudu

చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో కథలు చెప్పావ్, నేటి పాలనపై ఒక్కసారి అయినా మాట్లాడావా? అని ఉండవల్లిని అయ్యన్నప్రశ్నించారు. జగన్ సర్కార్ వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఉండవల్లిని కోరారు. వైసిపి అక్రమాలపై ఎందుకు నోరెత్తలేదన్నారు. తిరుపతి దేవస్థానంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంటే ఒక్కసారి కూడా నోరు విప్పలేదని, దేవస్థానాలకు చెందిన 43వేల ఎకరాలు కనబడడం లేదని మంత్రి చెబితే ఒక్కసారి కూడా నోరెత్తలేదు ఎందుకని ప్రశ్నించారు.

గోదావరిలో ఇసుకను దోచుకుంటున్న వారిపై ఎందుకు మాట్లాడలేదని ఉండవల్లిని అయ్యన్న ప్రశ్నించారు. ఆ ఇసుక దోపిడీలో నీకు ఏమైనా వాటా ఉందా? అని అడిగారు. రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడలేదని, కత్తిపూడి జంక్షన్ వద్ద ఫారెస్ట్ భూముల్లో ఖనిజ సంపద దోచుకుంటుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదని గుర్తుచేశారు. ల్యాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి దాన్ని భారతి సిమెంట్ కంపెనీలకు టిప్పర్లతో పోలీసుల కనుసన్నల్లో తోలుతుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదని ఆరోపించారు. లక్షల టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏడిపిస్తుంటే ఎందుకు నోరెత్తలేదని, మేధావిగా చెప్పుకుని తిరిగే నువ్వు తప్పుడు మనుషులకు సహకరించడం ఏంటని ప్రశ్నించారు.

 undavalli arun kumar

ఉండవల్లి రామోజీరావుపై ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాడని, కానీ రామోజీరావుపై ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. రామోజీరావు ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదని, అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని వేల మంది ఉన్నారని , వారి సమస్యలపై ఉండవల్లి ఒక్కసారి కూడా ఎందుకు నోరెత్తలేదని అడిగారు. ఉండవల్లి ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే మాట్లాడతాడా? ఉండవల్లి మేధావా? మేతావివా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.

రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని ఉండవల్లి నిలదీయలేదని అయ్యన్న తెలిపారు.
ఇలాంటి మేధావి రాష్ట్రంలో ఉండడం బాధాకరమన్నారు. గంజాయి సరఫరాలో ఏపీని జగన్ మొదటి స్థానంలో నిలబెడితే కనీసం ఒక్కసారి కూడా యువత భవిష్యత్తు గురించి ఉండవల్లి నోరెత్తలేదన్నారు. పోలీసులు జగన్ చుట్టూ తిరగడం తప్ప...శాంతిభద్రతలు, యువత భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదన్నారు.కుట్రదారులతో కుమ్మక్కై నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని కోరారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న విధ్వంసకుడి చర్యల్లో ఉండవల్లి పాత్రదారుడు కావద్దని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తిచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+