బొత్స ఫ్యామిలీ సహా టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ? టీడీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ ..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల వార్ ముదురుతోంది. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని ప్రకటించి వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు మంత్రులు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ ను టార్గెట్ చేసిన మంత్రి బొత్స.. అదే సమయంలో టీడీపీని కూడా కలిపి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది తర్వాత టీడీపీ,జనసేన ఉంటే తాను గుండు కొట్టించుకుంటానన్నారు.
దీనిపై టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమ అంతే దీటుగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉండవంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అదే ఎన్నికల్లో బొత్సను చీపురుపల్లిలోనూ, ఆయన కుటుంబ సభ్యులను విజయనగరం జిల్లాల్లోనూ ఓడిస్తామన్నారు. అక్కడితో ఆగకుండా ఇప్పటికే బొత్స కుటుంబ సభ్యులతో పాటు ఏకంగా 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలిపారు.

బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ గా బోండా ఉమ ఆయనకో మరో సవాల్ విసిరారు. మీకు అంత నమ్మకం ఉంటే ఉగాది వరకూ ఎందుకు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని బోండా కోరారు. తద్వారా వైసీపీతో మరో మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో బోండా ఉమ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి. మరోవైపు బోండా ఉమ సీఎం జగన్ పైనా విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితుల్లో సీఎం జగన్ ప్రజలతో కాళ్ల బేరానికి వస్తున్నట్లు బోండా ఉమ అంచనా వేశారు. తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం అన్నారు. తద్వారా వైసీపీ బలహీనపడుతోందని, అందుకే తమపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బోండా చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ యాత్రలు చేస్తుంటే, మరో విపక్ష నేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో సాగిపోతున్నారు.












Click it and Unblock the Notifications