టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి?
తెలుగుదేశం పార్టీకి ఇరుసు లాంటి నేతను ఓడించారు. కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అక్కడ తనకు అవమానం జరిగిందంటూ పదే పదే ప్రస్తావించే ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి.
2004లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ కిల్లి కృపారాణి 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎర్రన్నాయుడిపై విజయం సాధించారు. మన్మోహన్‌సింగ్ హయాంలో కేంద్ర మంత్రి పదవికి చేజిక్కించుకున్నారు. అనంతర పరిణామాల్లో వైసీపీ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ ఎమ్మెల్సీ దక్కకపోగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించడంతో ఆమె నిరాశకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆమెను హెలిపాడ్ వద్దకు ఆహ్వానించలేదు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమెను కార్యక్రమంలో పాల్గొనాలంటూ ధర్మాన కృష్ణదాస్ వెళ్లి బతిమాలినప్పటికీ ఆమె వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పసుపు పార్టీతో ఆమె టచ్ లో ఉన్నారంటున్నారు. దీనిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున పోటీచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి లోక్ సభకు పోటీచేసి రెండోస్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. దీనిపై ఆమె నేరుగా స్పందించనప్పటికీ ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications