కాళ్లు మొక్కినొళ్లే వెన్నుపోటు పొడిచారు ! ఎన్టీఆర్ ఎపిసోడ్ పై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవజ్ఞుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ అదే రాజకీయాలు ఎలా ఉంటాయో తనదైన శైలిలో వివరించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య.. ఏపీ రాజకీయాలపైనే సెటైర్లు వేశారు.
పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దివంగత సీఎం ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ పైఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వెంకయ్య కాళ్లకు కొందరు మహిళలు నమస్కరించారు. దీంతో ఆయన ఓశారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అందులో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ వచ్చేసింది.

ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సమయంలో కొందరు మహిళలు ఆయనకు నమస్కరించారని, ఎందుకు నమస్కరించారని తాను ఎన్టీఆర్ ను అడిగానని వెంకయ్య తెలిపారు. నాపై వారికున్న ప్రేమ, అభిమానం అని ఎన్టీఆర్ బదులిచ్చారన్నారు. అయితే అభిమానమా...పిండాకూడా అంతా ఒట్టిదేనని తాను చెప్పానన్నారు.

సీన్ కట్ చేస్తే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆ ఆరుగురే ముందున్నారని వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఆరుగురు మహిళలు ఎవరో మాత్రం వెంకయ్య చెప్పలేదు.












Click it and Unblock the Notifications