Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజుగారికి గవర్నర్ గిరీ- మాజీ ఎంపీ కేశినేని నాని ట్వీట్..!

ఏపీలో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై ఒకప్పటి ఆయన సహచరుడు, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కూడా స్పందించారు.

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు గారి నియామకాన్ని అభినందిస్తున్నానంటూ కేశినేని నాని ఇవాళ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా, కేంద్ర పౌర విమానయాన మంత్రిగా 35+ సంవత్సరాలుగా ఆయన చేసిన విశిష్ట ప్రజా సేవ బలమైన పరిపాలనా చతురత, సమగ్రతను ప్రతిబింబిస్తుందని కేశినేని తెలిపారు. ఆయన సూత్రప్రాయ నాయకత్వం నుండి గోవా ప్రయోజనం పొందుతుందని కేశినేని ఆకాంక్షించారు.

former Vijayawada mp kesineni nani tweet on ashok gajapathi raju s appointment as goa governor

గతంలో 2014-19 మధ్య కేశినేని నాని విజయవాడ ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నిక కాగా.. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు అదే పార్టీ నుంచి గెలుపొందారు. అంతే కాదు అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. అప్పట్లో టీడీపీ సీనియర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు.. కేశినేని నాని వంటి జూనియర్లను కలుపుకుంటూ వెళ్లేవారు. దీంతో ఇవాళ గోవా గవర్నర్ గా అశోక్ ను నియమించగానే కేశినేని నాని సంతోషంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+