మూడు ఓట్లు నిజమే.. కానీ- వైసీపీ మాజీ మంత్రి అనిల్ క్లారిటీ..!
2019 ఎన్నికలకు ముందే తనపేరు మీద మూడు ఓట్లు ఉన్నాయని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ నిర్ధారించారు. ఆయనకు మూడు ఓట్లు ఉన్నాయంటూ తాజాగా విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇవాళ అనిల్ స్పందించారు. తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నాయంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, కానీ తాను ఈ విషయాన్ని 2019 ఎన్నికలకు ముందే ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు అనిల్ తెలిపారు
2019 ఎన్నికల సమయలో తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నట్లు గుర్తించి తన ఇంటి పేరు మీద ఉన్నది కాకుండా మిగతా రెండు ఓట్లు తొలగించాలని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఈసీకి తాను డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీపీఐ రామకృష్ణ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. దేవుడి దయవల్ల తనకు దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం లేదని ఆయనకు గుర్తుచేశారు.

2019 ఎలక్షన్స్ ముందే నా పేరు మీద మూడు ఓట్లు ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయడం జరిగిందని, మిగతా ఓట్లతో నాకు సంబంధం లేదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర 2019లోనే ఒక డిక్లరేషన్ తీసుకోవడం జరిగిందని అనిల్ ఇవాళ వెల్లడించారు. చేతకాక విపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని అనిల్ విమర్శించారు. టీడీపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు తనపై కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications