నా చెప్పు పోయి 9 నెలలైంది-గాజు గ్లాసు గుర్తుపోయి చాన్నాళ్లైంది-పవన్ కు పేర్ని కౌంటర్..
ఏపీలో ఎన్నికలకు ముందు రాజకీయాలు వేడెక్కాయి. కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టి, అందులో ప్రతీ రోజూ వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మధ్యమధ్యలో సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన అన్నవరం గుడిలో దర్శనానికి వెళితే తన రెండు చెప్పులు పోయాయని, వైసీపీ నేతలు చెప్పులు కూడా ఎత్తుకు పోతున్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణల వెనుక కారణం వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అంతకు ముందు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపించడమే.
అయితే అన్నవరం గుడిలో తన చెప్పులు పోయాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ నెల 13న చెప్పులు పోతే పవన్ కు 16వ తేదీన గుర్తొచ్చిందా అని పేర్ని ప్రశ్నించారు. అక్టోబర్ 19న తాను లింగమనేని రమేష్ కు చెందిన వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తే తన చెప్పులు పోయాయని, అప్పుడు తన కాళ్లకు ఉన్న ఓ చెప్పు పోయిందని పేర్ని వెల్లడించారు.

అక్టోబర్ లో ఓ చెప్పు పోయి తాను చస్తుంటే, మూడు రోజుల క్రితం పోయిన పవన్ కళ్యాణ్ రెండు చెప్పుల గురించి వైసీపీ ఆఫీసు తన ఇంటి ముందు ఉందని ఎవరిని అనుమానిస్తారన్నారు. తొమ్మిదినెలల క్రితం తన ఒక చెప్పు తీసుకెళ్లినవాడు ఏం చేసుకుంటున్నాడో తెలియడం లేదన్నారు. పవన్ కు చెప్పులు కొనుక్కునే స్తోమత ఉందని గుర్తుచేశారు. అయినా చెప్పులదేముంది జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తు పోయి చాలా రోజులైందని గుర్తుచేశారు. పోయిన చెప్పులను ఎవరొకరు కొంటారు, చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొంటారు అంతేగాని ముందు ని పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది ముందు అది చూసుకో అని సూచించారు.












Click it and Unblock the Notifications