చివరికి జగనన్న పథకాలే దిక్కయ్యాయా ? ఆర్కే రోజా సంచలన ట్వీట్..!

విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలు లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయుల్ని చేశాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బుడమేరు నీరు చుట్టుముట్టి ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరిపోని పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో తాము విమర్శించిన పథకాలను తిరిగి అమలు చేయాల్సిన పరిస్ధితి సీఎం చంద్రబాబుకు నెలకొంది. దీన్ని గుర్తుచేస్తూ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఓ ట్వీట్ పెట్టారు.

విజయవాడ వరద బాధితుల్ని ఆదుకుంటున్నవి జగనన్న పథకాలే అని గుర్తు చేస్తూ వరుసగా వాటి పేర్లతో ఆర్కే రోజా ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో రేషన్ వాహనాల నుంచి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు, రిటైనింగ్ వాల్, 108, 104 వాహనాలు, సచివాలయ ఉద్యోగులు, క్లీన్ ఆంధ్రా వాహనాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు ఇలా ప్రతీ పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉపయోగపడుతుందనే అర్ధం వచ్చేలా రోజా ట్వీట్ చేసారు.

former ysrcp minister rk roja explains how ys jagan s scheme saving Vijayawada flood victims

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకాలను రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిలిపేసింది. కానీ విజయవాడ వరదల సమయంలో తిరిగి వీటినే అమలు చేయక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీన్ని కూటమి ప్రభుత్వానికి రోజా గుర్తుచేశారు. అప్పట్లో కీలకంగా ఉన్న అధికారులతో పాటు మా పథకాలే ఇప్పుడు మీకు దిక్కుగా మారాయంటూ రోజా పెట్టిన ట్వీట్ ను వైసీపీ శ్రేణులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు క్షేత్రస్ధాయిలో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+