వైఎస్ జగన్ తో ఆర్కే రోజా భేటీ-ఓటమి తర్వాత ఇదే-సెల్ఫీతో క్లారిటీ..!
గత ఐదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా.. నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కనుమరుగయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం అధినేత జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తడమో, లేక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతూనో కనిపించిన రోజా.. గత కొంతకాలంగా మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం మానేశారు. దీంతో ఇక వైసీపీకి రోజా దూరమైనట్లే అన్న ప్రచారం కూడా సాగింది. ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్న రోజా హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లిలో జగన్ నిర్వహిస్తున్న పార్టీ నేతల సమీక్షల్లో సైతం కనిపించకుండా దూరంగా ఉండిపోయిన ఆర్కే రోజా.. నిన్న మాత్రం తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు వచ్చారు. తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్ధితిపై జగన్ తో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఇతర నేతలతో తనకున్న విభేదాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

తాడేపల్లిలో జగన్ తో జరిగిన తిరుపతి వైసీపీ నేతల భేటీకి సంబంధించిన ఫొటోల్ని ఆర్కే రోజా ఎక్స్ లో పోస్టు చేశారు. అంతే కాదు అధినేత జగన్ తో చాలా కాలం తర్వాత దిగిన సెల్ఫీని కూడా పెట్టారు. తద్వారా తన భవిష్యత్ రాజకీయంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా.. ఇప్పుడు తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో గతంలోలాగే రోజా మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లి @YSRCParty కేంద్ర కార్యాలయంలో తిరుపతి జిల్లా వైయస్ఆర్ సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ @ysjagan గారు సమావేశం. pic.twitter.com/lHJwGQFtF0
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 12, 2024












Click it and Unblock the Notifications