Vellampalli Srinvias: సీటు మార్పు, రాజీనామాపై మాజీ మంత్రి వెల్లంపల్లి క్లారిటీ..

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా సీటు మార్పుల్లో భాగంగా సొంత స్ధానాల్ని కోల్పోతున్న వారు, అసలే టికెట్లు దక్కని వారు అసంతృప్తిగా కనిపిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నారు. మరికొందరు ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయవాడ పశ్చిమ సీటులో ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం దక్కడం కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. ఆయన్ను విజయవాడ సెంట్రల్ సీటుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్తిగా ఉన్న వెల్లంపల్లి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ తాజా పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు.

Former YSRCP minister vellampalli Srinivas clarified seat change, and resignation rumors

విజయవాడ పశ్చిమ సీటు మార్పుపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి.. తాను మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. విజయవాడ సెంట్రల్ స్థానానికి తనను వెళ్ళమని చెప్పారన్నది నిజం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే పార్టీకి రాజీనామా చేశానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. సీటు మారేది లేదని, అలాగే పార్టీ కూడా మారేది లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వెల్లంపల్లిపై వచ్చినవన్నీ పుకార్లేనని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+