Vellampalli Meet YS Bharati : వైఎస్ భారతిని కలిసిన మాజీ మంత్రి వెల్లంంపల్లి -రీజన్ ఇదే !

ఏపీలో సీఎం జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయవాడ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రెండో కేబినెట్లో మాత్రం పదవి నిలబెట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తున్న వెల్లంపల్లి ఇవాళ ఉన్నట్లుండి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని కలిశారు. తాడేపల్లిలోని ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. దీంతో ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని ఎందుకు కలిశారో తెలుసా ? దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటికి భారతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన భేటీ అయ్యారు. భారతి పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మరో కీలక విషయం కోసం కూడా ఆమెను వెల్లంపల్లి కలిశారు.

former ysrcp minster vellampalli srinivas met ys bharati today-here are details

ఈ నెల 14న వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహం ఉంది. దీంతో ఈ వివాహానికి సీఎం సతీమణి అయిన వైఎస్ భారతికి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వెల్లంపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన కుమార్తె వివాహానికి రావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను వెల్లంపల్లి ఆమెకు అందజేశారు. సీఎం జగన్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు బదులుగా వైఎస్ భారతికి ఈ ఆహ్వాన పత్రిక అందజేసినట్లు తెలుస్తోంది. తన కుమార్తె వివాహానికి సీఎం దంపతులు ఇద్దరూ రావాలని వెల్లంపల్లి కోరినట్లు తెలుస్తోంది.

former ysrcp minster vellampalli srinivas met ys bharati today-here are details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+