అమెరికాకు వల్లభనేని వంశీ పరార్ ? అరెస్టు భయంతో..

ఏపీలో గత టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పాత పాపాలు వెంటాడుతున్నాయి. అప్పట్లో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించడం ఓ ఎత్తయితే సొంత పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన అమెరికాకు పరారయ్యారు.

ఎన్నికల ఫలితాల తర్వాత గన్నవరం వదిలి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ.. కాన్నాళ్లు హైదరబాద్ లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నారు. అనంతరం గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పోలీసులు తన కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలు తనను గాలిస్తుండగానే వంశీ.. అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికా వెళ్లే అవకాశం ఉందని అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ లో తీవ్ర గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

former ysrcp mla vallabhaneni Vamsi escaped to America with fear of arrest

గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీ పాత్రపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుసుకున్న వంశీ.. హైదరాబాద్ నుంచే అమెరికా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వెళ్లి మరీ ఆయన్ను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీతో పాటు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వంశీ మినహా మిగిలిన వారిని కోర్టులో హాజరుపర్చారు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+