Vijayasai Reddy: విజయసాయిరెడ్డి యూటర్న్ ? సిట్ విచారణకు డుమ్మా..!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు షాకిచ్చారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు ఇవాళ హాజరవుతానని చెప్పిన సాయిరెడ్డి చివరి నిమిషంలో రాకుండా ఉండిపోయారు. దీంతో ఆయన కోసం ఏర్పాట్లు చేసిన పోలీసులు ఆయన విషయంలో ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచినా సాయిరెడ్డి ఎందుకు రాలేదన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీ హయాంలో సొంత బ్రాండ్లను తెచ్చి నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఇతరులపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటిక సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డే కర్త, కర్మ, క్రియ అంటూ గతంలో విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. అంతే కాదు ఈ వ్యవహారంపై అడిగితే మరిన్ని వివరాలు చెప్తానని కూడా బహిరంగంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో విచారణకు రావాలని సీఐడీ సిట్ విభాగం రాజ్ కసిరెడ్డికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో హైదరాబాద్ లోని ఆయన ఇళ్లలో సోదాలు కూడా చేస్తోంది. అదే సమయంలో రాజ్ కసిరెడ్డితో పాటు మద్యం స్కాంపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సిట్ విచారణకు రావాలని సాయిరెడ్డికి నోటీసులు పంపారు. ఈ కేసులో సాక్షిగానే సాయిరెడ్డిని పిలిపించారు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులివ్వగా.. ఆయన ఒక రోజు ముందే వస్తానని సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ సాయిరెడ్డి సిట్ విచారణకు వస్తారని అంతా భావించారు. కానీ ఆయన హ్యాండిచ్చారు.
వైసీపీ నేతలు కొందరు సాయిరెడ్డితో టచ్ లోకి వెళ్లి ఈ కేసులో వివరాలు బయటపెట్టకుండా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సాయిరెడ్డి ఇవాళ విచారణకు రాలేదన్న చర్చ జరుగుతోంది. అయితే గతంలో మద్యం స్కాంలో వివరాలు చెప్తానని చెప్పి ఇప్పుడు సాయిరెడ్డి తప్పించుకుంటే ఆయన విషయంలో సిట్ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇదే కేసులో మిధున్ రెడ్డి ఎల్లుండి సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications