Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయిరెడ్డి మరో బిగ్ ట్విస్ట్..! కాంగ్రెస్ అధ్యక్షుడికి సంకేతం..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారు. వైసీపీకీ, ఎంపీ పదవికీ, రాజకీయాలకూ ఒకేసారి గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఉన్నట్లుండి ఏపీ మద్యం స్కాంలో సాక్షిగా వెళ్లి విచారణకు సహకరించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది.

ఇలా ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు ఇస్తున్న విజయసాయిరెడ్డి.. ఇవాళ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతెత్తున లేచే సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేకు ఓ ట్వీట్ పెట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలపై విమర్శలకే పరిమితమైన సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం అనూహ్యంగా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

former ysrcp mp vijayasai reddy wishes congress president Mallikarjun kharge amid rumours

దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశానికి నిరంతర సేవ చేయాలని కోరుకుంటున్నానని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనందున, కార్యకలాపాలు నిర్మాణాత్మకంగా, అంతరాయం లేకుండా కొనసాగాలని ఆశిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. గందరగోళం, వాయిదాల ద్వారా పట్టాలు తప్పకుండా, చర్చ ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచినప్పుడు ప్రజాస్వామ్యం ఉత్తమంగా పనిచేస్తుందని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కీలక సూచన చేస్తున్నట్లుగా ఉందన్న చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని ఎదిరించి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కు ఆయన వద్ద ఆడిటర్ గా ఉన్న సాయిరెడ్డి అన్ని విధాలా అండగా నిలిచారు. అంతే కాదు ఢిల్లీలోనూ వైసీపీ తరఫున లాబీయింగ్ చేస్తూ ఏకంగా ప్రధాని కార్యాలయంలోనే పట్టు సంపాదించారు. చివరికి అదే వైసీపీని వీడి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సాయిరెడ్డి చంద్రబాబు కోసమే వైసీపీనీ, మూడున్నరేళ్ల గడువున్న ఎంపీ పదవినీ వదిలేశారంటూ జగన్ విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+