• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మందకృష్ణ ఒక్కడు, అవతల జగన్: టిడిపిలో నాలుగు స్తంభలాట

By Pratap
|

గుంటూరు: ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ చేయి దాటిపోకుండా జాగ్రత్తపడినట్లు భావిస్తున్నారు. ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగపై వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యతో రగడ ప్రారంభమైంది. అయితే, కాపు ఉద్యమం లాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేతిలో ఆయుధం కాకుండా ఆయన ముందుచూపుతో వ్యవహరించినట్లు చెబుతున్నారు.

కాపు ఉద్యమంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న స్థితిలో ఎస్సీ వర్గీకరణ అంశం అగ్గి రాజేస్తుందనే ఆందోళనతోనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మందకృష్ణ మాదిగపై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఆ ఆలోచన లేదు అని పుల్లారావు అన్నారు.

ఎస్సీ ఉపకులాలన్నీ ఏదైతే కోరుకుంటున్నాయో వాటి కోసం జీవో నెం.25ను తీసుకు వచ్చాం కాబట్టి ఎస్సీలు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని, మంద కృష్ణ రాజకీయ లబ్ధి కోసం వారిని రెచ్చగొడితే మరో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అనుచరులతో మంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Four leaders of Guntur district fight on Sc reservations

పత్తిపాటి పుల్లారావుపై డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ముద్రగడ మాదిరిగా మంద కృష్ణ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించక ముందే ఆయనను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం డొక్కా చేసినట్లు అర్థమవుతోంది. మరో ఎస్సీలు టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందని డొక్కా గ్రహించారు. అందుకే ఆయన మంద కృష్ణనే తమ నాయకుడని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయనతో డొక్కా సమావేశమయ్యారు. దీంతో ఎస్సీ వర్గీకరణ అంశంలోకి ప్రతిపక్షాలను చొరబడనీయకుండా చేయడంలో విజయం సాధించారని అంటున్నారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పుల్లారావు, డొక్కా మధ్య మాటల విభేదాలు నడుస్తుండగా మంత్రి రావెల కిషోర్‌బాబు రంగప్రవేశం చేశారు. సంబంధిత శాఖ మంత్రి అయిన తనను సంప్రదించకుండా ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడడం మంచిది కాదని సూచించారు. పార్టీ నాయకులు మాట్లాడాలంటే తనను సంప్రదించి మాట్లాడాలన్నారు.

ఇదిలావుంటే, డొక్కా చేసింది మంచి పనేనని ఆయన గురువు, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై డొక్కా ముందుగా మంద కృష్ణతో చర్చించడంతో ఎస్సీలకు పార్టీ, ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
it is said that Telugu Desam party (TDP) leader Dokka manikyavaraprasad acted on Manda Krishna Madiga to save another reservation issue in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more