వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగుకాళ్ల శిశువు: ఉదరం నుంచి మరో రెండు.. చూడటానికి జనం 'క్యూ'!

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ.. నాలుగు కాళ్ల శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగం నుంచి మరో రెండు కాళ్లు బయటకొచ్చాయి.

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ.. నాలుగు కాళ్ల శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగం నుంచి మరో రెండు కాళ్లు బయటకొచ్చాయి. నాలుగు కాళ్లతో పుట్టిన శిశువును చూడటానికి జనం ఆసుపత్రికి క్యూ కట్టారు. జన్యుపరమైన లోపాల వల్లే.. శిశువు ఎదుగుదలలో ఇలాంటి శారీరక మార్పులు సంభవించినట్లు చెబుతున్నారు.

Four legged baby

మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన ఎల్లిమి మణి(25) గురువారం ఉదయం 6.25గం.కు ఈ నాలుగు కాళ్ల శిశువుకు జన్మనిచ్చింది. 1.460కిలోల బరువున్న ఈ శిశువుకు రెండు కాళ్లు, రెండు చేతులతో పాటు అదనంగా రెండు కాళ్లు ఉన్నాయి.

ఉదరభాగంలో నుంచి పుట్టుకొచ్చిన కాళ్లను తొలగించడం వైద్యులకు సవాలే అని చెప్పాలి. శిశువు పూర్తిగా కోలుకున్న తర్వాత అదనపు కాళ్లను తొలగిస్తామని పిల్లల వైద్య నిపుణురాలు మాణిక్యాంబ తెలిపారు. ప్రస్తుతం తల్లి-బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

English summary
In a rare case, a baby boy with four legs was born at a government hospital at Kakinada near Rajamahendravaram, in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X