నలుగురూ ఏకగ్రీవం - సీఎం అజెండా మేరకే : పెద్దల సభలో పెరిగిన బలం..!!

రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం పెరిగింది. ఏపీ అసెంబ్లీలో ఉన్న బలం కారణంగా మరో పార్టీకి అవకాశం లేకుండా గత రెండేళ్ల కాలంగా వైసీపీ అభ్యర్ధులే రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నారు. తాజాగా.. నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డికి ఎన్నిక అయినట్లుగా డిక్లరేషన్ అందించారు. ముఖ్యమంత్రి జగన్‌ అజెండా మేరకు పనిచేస్తామని నలుగురు సభ్యులు చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేసారు.

సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. బీసీ సంఘాల ప్రముఖ నేతగా ఉన్న ఆర్ క్రిష్ణయ్య అనూహ్యంగా వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. 994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. పెద్దల సభకు ఎంపిక అయిన బీదా మస్తాన రావు ప్రముఖ వ్యాపార వేత్త. నెల్లూరు జిల్లా బోగోల్‌ మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు.

నలుగరి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా

నలుగరి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా

బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ వ్యవహరించారు. వైఎస్సార్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విజయ సాయరెడ్డికి రెండో సారి రాజ్యసభకు రెన్యువల్ అయింది.

చెన్నైలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు.

పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం

పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం

సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి సైతం ఏకగ్రీవంగా ఎన్నికై..పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంగానికి చెందిన ఆయన పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు.

ఎన్నికల సంఘంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పలు కేసుల్లో కూడా సేవలందించారు. ఇక, 2024 ఎన్నికల సమయంలో మరో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందే ఈ ఎన్నికలు జరిగితే రెండు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+