వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు: వారి పరిస్థితేంటీ: మోహన్ బాబుకు ఈసారైనా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభల తన బలాన్ని మరింత పెంచుకోనుంది. తన గళాన్ని మరింత బలంగా వినిపించనుంది. ఈ సంవత్సరమే రాష్ట్రం నుంచి ఏకంగా నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగుకు నాలుగూ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టే. దీనితో పెద్దల సభలో వైసీపీకి ఉన్న బలం 10కి చేరుతుంది.

సాయిరెడ్డి సహా..

సాయిరెడ్డి సహా..

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యుల పదవీ కాలం ఈ సంవత్సరం ముగియబోతోంది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు ఈ ఏడాదే రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. ఈ నలుగురిలో విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభ రీ నామినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మిగిలిన ముగ్గురూ మాజీలుగా మిగలాల్సి ఉంటుంది.

జూన్ నాటికి..

జూన్ నాటికి..


ఆ నలుగురు నాయకుల రాజ్యసభ సభ్యత్వం వచ్చే జూన్ నాటికి ముగుస్తుంది. జూన్ 21వ తేదీతో ఆరు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వ కాల పరిమితి ముగుస్తుంది. 2016లో వైఎస్ఆర్సీపీ తరఫున సాయిరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ తరఫున పెద్దల సభకు పంపించింది. అప్పట్లో బీజేపీతో ఉన్న పొత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం సురేష్ ప్రభును కూడా ఏపీ నుంచే నామినేట్ చేసింది.

ఫిరాయింపుల జోరు..

ఫిరాయింపుల జోరు..

2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పార్టీ ఫిరాయించారు. బీజేపీ కండువాను కప్పుకొన్నారు. బీజేపీ సభ్యులుగానే రిటైర్ కానున్నారు. ఆ ముగ్గురి కాలపరిమితి ముగియడం వల్ల ఏర్పడే ఖాళీలు వైసీపీ ఖాతాలోనే వెళ్లనున్నాయి. విజయసాయి రెడ్డిని రీ నామినేట్ చేయడంతో పాటు- వైసీపీ అగ్ర నాయకత్వం మరో ముగ్గురు కొత్తముఖాలను పెద్దల సభకు పంపిస్తుంది.

ఆరు నుంచి 10కి..

ఆరు నుంచి 10కి..

దీనితో వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆరు నుంచి 10కి పెరుగుతుంది. ప్రస్తుతం విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నథ్వాని.. వైసీపీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. సాయిరెడ్డిని రీనామినేట్ చేస్తే.. మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని వైసీపీ నాయకత్వం ఎవరిని పంపిస్తుందనేది ప్రస్తుతం హాట్ డిబేట్‌గా మారింది.

తోసిపుచ్చిన చిరంజీవి..

తోసిపుచ్చిన చిరంజీవి..

వైఎస్ జగన్ ఈ దఫా మెగాస్టార్ చిరంజీవిని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు విస్తృతంగా వినిపించిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల నియంత్రణ వివాదాన్ని పరిష్కరించడానికి టాలీవుడ్ తరఫున చిరంజీవి.. వైఎస్ జగన్‌తో భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీ కండువాను కప్పుకొంటారనే ప్రచారం సాగింది. దీన్ని చిరంజీవి నిర్ద్వందంగా తోసిపుచ్చారు. రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

ఆ మిగిలిన ముగ్గురు ఎవరు..?

ఆ మిగిలిన ముగ్గురు ఎవరు..?

సాయిరెడ్డిని రీ నామినేట్ చేయగా.. మిగిలిన మూడు స్థానాల్లో వైఎస్ జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు రాజ్యసభ రేసులో నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఎప్పటి నుంచో ఆయన ఈ పదవిని ఆశిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 2019 నాటి ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు.

సురేష్ ప్రభు కోసం బీజేపీ లాబీయింగ్..

సురేష్ ప్రభు కోసం బీజేపీ లాబీయింగ్..

కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన వైఎస్ జగన్ రాజ్యసభ సభ్యులను నామినేట్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా- సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి సురేష్ ప్రభు కోసం బీజేపీ అగ్ర నాయకత్వం లాబీయింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఆయనను మళ్లీ ఏపీ నుంచే రాజ్యసభకు పంపించడమా? లేక.. ఆయన కోటాను తమకే కేటాయించాలని బీజేపీ కోరవచ్చని తెలుస్తోంది. సురేష్ ప్రభు స్థానంలో మరో బీజేపీ నేతను రాజ్యసభ నుంచి నామినేట్ చేయాలని వైసీపీని కోరే ప్రయత్నం చేయొచ్చని అంటున్నారు.

English summary
Four Rajya Sabha seats will be vacant in the AP this year, 1 YSRCP and 3 BJP members will retire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X