అమెరికాలో వర్సిటీల వీసా ఫ్రాడ్: నలుగురు తెలుగువాళ్ల పాత్ర
హైదరాబాద్: అమెరికావ్యాప్తంగా భారీ స్థాయిలో వెలుగు చూసిన హెచ్ -1బి వీసా ఫ్రాడ్‌లో నలుగురు తెలుగువాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. భారత సంతతికి లేదా భారతీయ అమెరికన్లకు సంబంధించిన ఈ వీసా కుంభకోణం మంగళవారంనాడు వెలుగు చూసింది. తెలుగువాళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
అమెరికాలోని ఈ నకిలీ వర్సిటీ వీసాల ఫ్రాడ్‌లో అరెస్టైన వారిలో పది మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వెయ్యి మందికిపైగా విదేశీయులకు విద్యార్థి, కార్మిక వీసాలను అక్రమంగా అందించినట్లు గుర్తించారు. మధ్యవర్తులు, ఉద్యోగ సంస్థల అధిపతులు, నియామకులు సహా 21 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల పేర్లతో కూడిన జాబితాను బుధవారం వారు విడుదలచేశారు.

పది మంది భారతీయ అమెరికన్లు లేదా భారత సంతతి ప్రజలు ఉన్నట్లు ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. నిందితుల్లో తేజేశ్ కొడాలి, కార్తిక్ నిమ్మల, గోవర్ధన్ ద్యావరశెట్టి, అవినాశ్ శంకర్ అనే తెలుగువాళ్లని తెలుస్తోంది. సయ్యద్ ఖాసీం అబ్బాస్ తదితర చైనా, భారత్‌కు చెందినవారి పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ కుంభకోణాన్ని విస్తృత దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినట్లు న్యూజెర్సీ అటార్ని పాల్ జె.ఫిష్‌మ్యాన్ తెలిపారు.
అక్రమ మార్గంలో వీసాల మంజూరు చేయిస్తున్న వారిని పట్టుకునేందుకు అమెరికా అంతర్గత భద్రతా విభాగం మొదట ఓ నకిలీ వర్సిటీని సృష్టించిందని చెప్పారు. 2013లో ఉత్తర న్యూజెర్సీ విశ్వవిద్యాలయం పేరిట క్రాన్‌ఫోర్డ్‌లో దీన్ని తెరిచిందని, ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన నిందితులు26 దేశాలకు చెందినవారికి వీసాలు ఇప్పించేందుకు దీన్ని అక్రమంగా వాడుకున్నారని చెప్పారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications