హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతడు కన్నేసిన మహిళ కాపురం కూలాల్సిందే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తనకు నచ్చిందంటే చాలు, ఆ మహిళ కాపురం కూల్చేస్తాడు. భార్యాభర్తలను విడదీస్తాడు. మహిళను లోబరుచుకుని ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతాడు. అతని ఆగడాలు ఒకటీ రెండూ కాదు, ఎన్నో. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా చెప్పుకొని చలామణి అవుతున్న ఘరానా మోసగాడు అతను. జీడిమెట్ల డాన్‌.. మొహ్మద్ సాదత్‌ అహ్మద్‌ బతుకు అది. ఎవరైనా ఇల్లు నిర్మించుకున్నా, స్థలం కొనుగోలు చేసినా, రకరకాల గొడవలు పెట్టి వారి నుంచి డబ్బు వసూలు చేస్తాడు. ఇలా బెదిరింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్న అతని ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు.

వరుసగా రెండో రోజు బుధవారం కూడా పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న వాహనాలతోపాటు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌, భూ సెటిల్‌మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మానవ హక్కుల పేరుతో ఉన్న రశీదు పుస్తకాలు, సాదత్‌ నుంచి గుర్తింపు కార్డులు కోరుతూ కొందరు చేసుకున్న దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

అతడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలను బాలానగర్‌ ఉపకమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, బాలానగర్‌ సహాయ కమిషనర్‌ నంద్యాల నరసింహారెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి బుధవారం వెల్లడించారు. సాదత్‌ అరాచకాల బారిన పడిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలను సెటిల్‌ చేసి రెండు వర్గాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం ఇతడి ప్రధాన దందా. మొత్తం 30 మంది మహిళలతో సాదత్‌ సంబంధాలు కొనసాగుతున్నాయని పోలీసులు తేల్చారు

మహా మాయగాడు

మహా మాయగాడు

పోలీసులు సాదత్ మొహ్మద్ సాదత్ అహ్మద్ ఇంట్లో పోలీసులు మంగళవారంనాడే కాకుండా బుధవారంనాడు కూడా సోదాలు నిర్వహించారు.

మహా మాయగాడు

మహా మాయగాడు

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా చెప్పుకుంటూ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సాదత్ అహ్మద్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

మహా మాయగాడు

మహా మాయగాడు

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి, వారిని విడదీసి, ఆ తర్వాత మహిళను లోబరుచుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకున్న సాదత్ అహ్మద్ కథ పెద్దదే.

మహా మాయగాడు

మహా మాయగాడు

మొహ్మద్ సాదత్ అహ్మద్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సాదత్ తన జీవితాన్ని నాశనం చేశాడని రెండో నిందితుడు గొడవకు దిగాడు.

మహా మాయగాడు

మహా మాయగాడు

సాదత్ అహ్మద్ సెటిల్‌మెంట్లు చేసి, గొడవలు పెట్టి పరిష్కరించే నెపంతో దండిగా డబ్బులు లాగాడు. వాటితో భవనం కూడా నిర్మించుకున్నాడు.

మహా మాయగాడు

మహా మాయగాడు

సాదత్ ఇంట్లో ఉన్న వాహనాలతోపాటు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌, భూ సెటిల్‌మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మానవ హక్కుల పేరుతో ఉన్న రశీదు పుస్తకాలు, సాదత్‌ నుంచి గుర్తింపు కార్డులు కోరుతూ కొందరు చేసుకున్న దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

మహా మాయగాడు

మహా మాయగాడు

సాదత్ అహ్మద్‌ను సికింద్రాబాదులోని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మహా మాయగాడు

మహా మాయగాడు

సాదత్ అహ్మద్ ముఠా వివరాలను బాలానగర్‌ ఉపకమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, బాలానగర్‌ సహాయ కమిషనర్‌ నంద్యాల నరసింహారెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి బుధవారం వెల్లడించారు.

మహా మాయగాడు

మహా మాయగాడు

సాదత్‌ అరాచకాల బారిన పడిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలను సెటిల్‌ చేసి రెండు వర్గాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం ఇతడి ప్రధాన దందా. మొత్తం 30 మంది మహిళలతో సాదత్‌ సంబంధాలు కొనసాగుతున్నాయని పోలీసులు తేల్చారు

బయటకు వెళ్తే కాన్వాయ్‌

సాదత్‌ అహ్మద్‌ అడుగు బయట పెట్టాడంటే అతడి వెంట భారీ కాన్వాయ్‌ ఉంటుంది. దందాలు, సెటిల్‌మెంట్లు చేసిన డబ్బులతో సాదత్‌ హోండా సీఆర్వీ, స్కోడా, ఏ స్టార్‌ కారులు, ఒక బుల్లెట్‌, మోటారు సైకిల్‌ కొన్నాడు. హోండా సీఆర్వీ కారుకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఇండియా చైర్మన్‌ అని పెద్ద బోర్టును ముందు భాగంలో అమర్చుకున్నాడు. ఈ కారులో సాదత్‌ రకరకాల సెటిల్‌మెంట్లకు వెళ్లేవాడు. ఈ కారుకు ముందూ వెనకా నాలుగైదు కార్లతో ఒక చిన్నపాటి కాన్వాయ్‌ ఉండేది.

అతను చెప్పే ‘అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం'లో ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుడు - ఇలా ఒక్కో పదవికి ఒక్కో రేటు నిర్ణయించి భారీగా వసూళ్లు చేశాడు. 50వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేసేవాడు. ఇలా డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఫొటోలు తీసుకుని గుర్తింపు కార్డులు కూడా ఇచ్చేవాడు. భూవివాదాలు పరిష్కరించినా, కుటుంబ తగాదాలు పరిష్కరించినా రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ‘ఫీజు'గా తీసుకునేవాడు.

ఇతడి నుంచి నకిలీ గుర్తింపు కార్డులు పొందిన వారే వివిధ డీల్స్‌ను సాదత్‌ వద్దకు తీసుకువచ్చేవారు. వాటిని సెటిల్‌ చేసిన తర్వాత వచ్చిన డబ్బును మొత్తం అందరూ పంచుకునేవారు. ఇలా సంపాదించిన డబ్బులతోనే సాదత్‌ భారీ భవనంతోపాటు ఖరీదైన వాహనాలు సమకూర్చుకున్నాడు. అతడుప్రస్తుతం నిర్మించిన భవనం ఏపీఐఐసీకి చెందిన స్థలంలో ఉందని తెలుస్తోంది.

పోలీసు శాఖలో ఉన్నతాధికారుల పేర్లను ఉపయోగించుకుని పలు పోలీసు స్టేషన్లలో సాదత్‌ జోరుగా పైరవీలు సాగించాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని ఆయా స్టేషన్లలో అధికారులను, సిబ్బందిని నమ్మించడానికి హ్యుమన్‌రైట్స్‌ వాయిస్‌ అనే పత్రికలో అధికారుల ఫొటోలతోపాటు తన ఫొటోలను ముద్రించుకునేవాడు. కొద్ది నెలల క్రితం జీడిమెట్లలో ఓ ఇన్‌స్పెక్టర్‌ ఇతడి బేరాలకు ఒప్పుకోకపోవడంతో, అతడిపై అతనిపై ఏసీబీ దాడులు చేయించాడు. సూరారం కాలనీలోని సాయిబాబానగర్‌ కేంద్రంగా సాదత్‌ దందాలు మూడేళ్లుగా సాగుతున్నాయి. ఫిర్యాదులు ఎక్కువవడంతో పోలీసులు మూడు నెలలుగా సాదత్‌పై కన్నేసి ఉంచి అతడి ఆట కట్టించారు.

English summary
A fraudster who claimed to be the president of the ‘Anti Corruption Brigade, and International Human Rights Organisation’ extorted crores from several people in Jeedimetla and surrounding areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X