డబ్బు కోసం.. స్నేహితుడి కొడుకునే కిడ్నాప్ చేసి, భయంతో ఏం చేశారంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వాళ్లంతా స్నేహితులు. కానీ వారిలో ఇద్దరి బుద్ధి పెడదారి పట్టింది. డబ్బు కోసం స్నేహితుడి కొడుకునే కిడ్నాప్ చేశారు. తీరా చేశాక భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక ఆ బాలుడ్ని చంపేసి చెరువులో పడేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

9 ఏళ్ల వయసున్న గౌతమ్ అనే బాలుడిని అతడి తండ్రి స్నేహితులు సాయి, మల్లి అపహరించారు. తాము అడిగినంత డబ్బు ఇస్తేగాని స్నేహితుడి కొడుకును వదలకూడదని భావించారు. అయితే తీరా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక గౌతమ్‌ను చంపి, మ‌తదేహాన్ని బి.యాలేరు చెరువులో పడేశారు.

Friends Kidnapped Friend's Son.. After that..

ఎట్టకేలకు పోలీసులు ఈ కేసులో నిందితులైన సాయి, మల్లిలను అరెస్టు చేశారు. మరోవైపు గౌతమ్ హత్యతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గౌతమ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They are friends. Two of them Kidnapped their Friend's Son, Gowtam, A 9-year-old Boy and later with fear, they murdered the boy and thrown into a lake. This incident was happened in Anantapurt District. Later police arrested the accused persons Sai, Malli. The family members of the victim Gowtam demanding the for justice.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి