మోడీ కాదన్నారు, వదలనని బాబు: నో రిలీఫ్.. జగన్ ప్లాన్ తిరగబడింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత రెండేళ్లుగా అన్నీ రివర్స్ అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ఆర్ మృతి అనంతరం నాటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ ఆయనను సీఎంగా చేద్దామని సంతకాలు చేశారు.

ఆ తర్వాత, ఇది రివర్స్ అయింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్, టిడిపిల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు వైసిపిలో చేరారు. అయితే, వారు రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచిన వారు ఉన్నారు.

కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పార్టీయే కనుమరుగు అయింది. ఏపీలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి జగన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. పార్టీ నుంచి ఇప్పటికే ఇరవై మంది వరకు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మిగతా వారిలో ఎప్పుడు ఎవరు టిడిపిలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

 From Chandrababu to ED: Reverse to YS Jagan!

కొద్ది నెలల క్రితం రాజ్ భవన్ వద్ద జగన్ మాట్లాడుతూ.. తనతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, సమయం వస్తే ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా 20 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు షాకిచ్చారు. తమ అభివృద్ధిని చూసి మరికొంతమంది వస్తారని చంద్రబాబు కూడా చెబుతున్నారు.

టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలు. ఏపీలో బీజేపీ నేతలు చంద్రబాబు కేబినెట్లో ఉంటే, కేంద్రంలో టిడిపి నేతలు మోడీ కేబినెట్లో ఉన్నారు. అయితే, పలుమార్లు టిడిపి - బిజెపి నేతలను దూరం చేసి, తాను కేంద్రంలో చేరాలని జగన్ ప్రయత్నాలు చేశారనేది టిడిపి నేతల వాదన.

బిజెపి - టిడిపి మధ్య జగన్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పలుమార్లు టిడిపి నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు కూడా కొందరు టిడిపి వాదనతో ఏకీభవించారు. ఆ రెండు పార్టీల మధ్య అప్పుడప్పుడు కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ, టిడిపి - బిజెపి దూరం కావడం లేదు. తద్వారా జగన్.. మోడీకి దగ్గర కావడం లేదు. జగన్ ఈ కోరిక కూడా నెరవేరడం లేదు.

ఇక, జగన్ ఆస్తుల కేసులో కూడా కేసు క్రమంగా బలహీనమవుతోందనే వాదనలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. కేసుతో సంబంధం ఉన్న అధికారులు ఒక్కరొక్కరిగా పలువురికి ఇటీవల ఊరట లభించిన విషయం తెలిసిందే. అధికారులు బయటపడుతున్న నేపథ్యంలో జగన్‌కు కూడా రిలీఫ్ దొరుకుతుందని చాలామంది భావించారు. కానీ ఈడీ అనూహ్యంగా ఏకంగా రూ.750 కోట్లను జప్థు చేసి, పెద్ద షాక్ ఇచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP chief YS Jaganmohan Reddy is facing problems.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి