బియాస్ విషాదం: జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు(పిక్చర్స్)
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థి జగదీశ్ మృతదేహాన్ని శుక్రవారం నగరంలోని మైసమ్మ బస్తీకి తీసుకొచ్చారు. శుక్రవారం అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన జగదీష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. ఎంతో ఆనందంగా విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా రావడంతో వారు తీవ్రంగా విలపించారు.
హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జగదీశ్(20) జూన్ 3న ఇండస్ట్రీయల్ టూర్‌లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. జూన్ 8న బియాస్ నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఫొటోలు దిగేందుకు వెళ్లిన జగదీష్ తన తోటి 24మంది విద్యార్థులతోపాటు గల్లంతయ్యాడు.
కాగా, అతని మృతదేహం గురువారం లభ్యం కావడంతో.. శుక్రవారం నగరానికి తీసుకొచ్చారు. రహ్మత్ నగర్ డివిజన్‌లోని మైసమ్మ బస్తీలో నివాసముంటున్న భార్గవి, మల్లేష్ దంపతులకు జగదీష్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు మహేష్.
జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. ఎంపి ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఆర్ఎస్ నాయకులు మురళీగౌడ్, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పోరేటర్ బండపల్లి చంద్రమ్మ, బిజెపి నాయకులు సత్యనారాయణ, ఇతర నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.

జగదీష్(ఫైల్)
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థి జగదీశ్ మృతదేహాన్ని శుక్రవారం నగరంలోని మైసమ్మ బస్తీకి తీసుకొచ్చారు.

కన్నీటి వీడ్కోలు
శుక్రవారం జగదీష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన జగదీష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.

కన్నీటి వీడ్కోలు
ఎంతో ఆనందంగా విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా రావడంతో జగదీష్ తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు.

కన్నీటి వీడ్కోలు
జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు.

కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జగదీశ్(20) జూన్ 3న ఇండస్ట్రీయల్ టూర్‌లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

కన్నీటి వీడ్కోలు
జూన్ 8న బియాస్ నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఫొటోలు దిగేందుకు వెళ్లిన జగదీష్ తన తోటి 24మంది విద్యార్థులతోపాటు గల్లంతయ్యాడు.

కన్నీటి వీడ్కోలు
ఎంపి ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఆర్ఎస్ నాయకులు మురళీగౌడ్, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పోరేటర్ బండపల్లి చంద్రమ్మ, బిజెపి నాయకులు సత్యనారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications